Kattappa Baba । కుక్క కాదు.. కట్టప్ప బాబా.. యజమానులకు ఆశీర్వాదాలు
పెంపుడు కుక్కలకు (Pet Dogs) , వాటి యజమానులకు ఉండే అనుబంధమే వేరు. అలాంటి ఒక ‘ఇంటి భైరవుడు..’ బాబా (BABA) అవతారం ఎత్తి తనను పెంచుకుంటున్న ఇంట్లోవారికి ఆశీర్వాదాలు (Blessings ) అందిస్తున్న వీడియో నెట్టింట చక్కర్లు కొడుతున్నది. విధాత : మనిషికి అత్యంత విశ్వసనీయ జంతువుల్లో కుక్క ఒకటి. దాదాపు ఇంట్లో మనిషి అన్నట్టు కుక్కలు కలిసిపోతుంటాయి. అప్పుడప్పుడు తమ వింత చేష్టలతో (Bond Between Dogs and Humans) అలరిస్తుంటాయి. తనను పెంచుకునేవారితో […]

పెంపుడు కుక్కలకు (Pet Dogs) , వాటి యజమానులకు ఉండే అనుబంధమే వేరు. అలాంటి ఒక ‘ఇంటి భైరవుడు..’ బాబా (BABA) అవతారం ఎత్తి తనను పెంచుకుంటున్న ఇంట్లోవారికి ఆశీర్వాదాలు (Blessings ) అందిస్తున్న వీడియో నెట్టింట చక్కర్లు కొడుతున్నది.
విధాత : మనిషికి అత్యంత విశ్వసనీయ జంతువుల్లో కుక్క ఒకటి. దాదాపు ఇంట్లో మనిషి అన్నట్టు కుక్కలు కలిసిపోతుంటాయి. అప్పుడప్పుడు తమ వింత చేష్టలతో (Bond Between Dogs and Humans) అలరిస్తుంటాయి. తనను పెంచుకునేవారితో కలిసి ఆటలాడుకుంటాయి. కానీ.. ఈ కుక్క రేంజ్ ఇంకాస్త ఎక్కువే. ఎంత ఎక్కువంటే.. తన యజమానులకు దీవెనలిచ్చేంత! ఈ కుక్క పేరు కట్టప్ప.
View this post on Instagram
అయితే.. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ‘కట్టప్ప బాబా’ అని ఆ కుక్క పేరు మార్చేశారు. విషయానికొస్తే.. కట్టప్ప అనే గోల్డెన్ రిట్రైవర్ (Golden Retriever) జాతి కుక్కను ఒక కుటుంబం పెంచుకుంటున్నది. సరదాగా ఒక రీల్ చేశారు. అందులో కట్టప్ప.. తనను పెంచుకునే కుటుంబంలోని సభ్యులను ముందరి కాలు ఎత్తి తలపై ఉంచి దీవిస్తూ ఉంటుంది.
ఈ వీడియో వందల సరదా వ్యాఖ్యలను పుట్టించింది. ఒకరు ‘జయహో కట్టప్ప బాబాకీ’ అని కామెంట్ పెడితే.. ‘పరీక్షల్లో పాస్ అయ్యేట్టు దీవించు’ అని మరొకరు కామెంట్ చేశారు. ఇంకొకరైతే.. ‘బాబా డాగ్‌ఆనంద్’ అంటూ కొత్త బిరుదు ఇచ్చారు. మరో నెటిజన్.. దర్శనం వేళలు చెప్పండి ప్లీజ్ అంటూ రెస్పాండ్ అయ్యారు. మొత్తం మీద కట్టప్ప బాబా వీడియోకు లక్షల్లో అభిమానులయ్యారు.