కేఎంసీలో పీజీ విద్యార్థిని ఆత్మహత్యా యత్నం

మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలింపు మీడియాను అడ్డుకున్న ఎంజీఎం సిబ్బంది ఆత్మహత్యయత్నానికి కారణం తెలియాల్సి ఉంది విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ (KMC) పీజీ (PG) అనస్తీషియా వైద్య విద్యార్థిని ధరావత్ ప్రీతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన బుధవారం జరిగింది. మరో పీజీ వైద్యుని వేధింపులు తాళలేక ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు చెబుతున్నారు. ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ప్రీతిని చికిత్సనిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్య చేసుకున్న ప్రీతిని మెరుగైన వైద్యం […]

  • Publish Date - February 22, 2023 / 07:41 AM IST
  • మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలింపు
  • మీడియాను అడ్డుకున్న ఎంజీఎం సిబ్బంది
  • ఆత్మహత్యయత్నానికి కారణం తెలియాల్సి ఉంది

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ (KMC) పీజీ (PG) అనస్తీషియా వైద్య విద్యార్థిని ధరావత్ ప్రీతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన బుధవారం జరిగింది. మరో పీజీ వైద్యుని వేధింపులు తాళలేక ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు చెబుతున్నారు. ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ప్రీతిని చికిత్సనిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్య చేసుకున్న ప్రీతిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కి ఎంజీఎం సిబ్బంది తరలిస్తున్నారు.

  • వేధింపులు కారణమా?

ఇదిలా ఉండగా ప్రీతి ఆత్మహత్యయత్నానికి సంబంధించిన పూర్తి వివరాలు, కారణాలు గోప్యంగా పెడుతున్నారనే ఆరోపణలు వ్యక్తమైతున్నాయి.

మీడియాను అడ్డుకున్న ఎంజీఎం సూపరింటెండెంట్

ప్రీతికి సంబంధించి ఎలాంటి ఫోటోలు, వీడియోలు తీయకుండా ఎంజీఎం అవుట్ పోస్ట్ పోలీసులు, సిబ్బందితో.. మీడియా ను అడ్డుకున్నారు. ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ తమ తప్పులు బయటపడకూడదనీ, జాగ్రత్తలు పడుతున్నారనే విమర్శలు వ్యక్తమైతున్నాయి.

ఆత్మహత్యకు పాల్పడి, చికిత్స పొందుతున్న వైద్య విద్యార్థిని ప్రీతి నివాసం హైదరాబాద్‌‌గా చెబుతున్నారు. ప్రీతి తండ్రి నరేందర్ రైల్వే ఎస్ఐ గా పనిచేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.