ఫోను దొరకాలి గోవిందా.. ఈడీకి చిక్కాలి గోవిందా.. అయ్యన్న వింత కోరిక!

విధాత‌: ఎవులైనా తిరప్తి ఎళ్తే.. దేముడా.. సేనా కష్టపడి ఇంతదూరం ఎలిపొచ్చాము.. మా బాధలు మాపవయ్యా.. కష్టాలు కడతేర్చవయ్యా అంతారు. కానీ ఈయన మాత్రం ఇసిత్రమైన కోరిక కోరినాడులే.. మరేటిమరేటి కాదు.. ఆయన రాజకీయ ప్రత్యర్థి ఫోను ఈమద్దిన పోయిందిలే..ఆ ఫోను గమ్మున దొరికేలా చూడాలని తీరప్తి వెంకన్నను కోరుకున్నాడు. టీడీపీ మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు ఇందాకే వెంకన్న దర్శనం నుంచి బయటికి వచ్చారు. వస్తూనే మీడియాను చూసి మాట్లాడారు. దుర్మార్గుల‌ పరిపాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడవయ్యా అని […]

  • By: krs    latest    Nov 26, 2022 1:39 PM IST
ఫోను దొరకాలి గోవిందా.. ఈడీకి చిక్కాలి గోవిందా.. అయ్యన్న వింత కోరిక!

విధాత‌: ఎవులైనా తిరప్తి ఎళ్తే.. దేముడా.. సేనా కష్టపడి ఇంతదూరం ఎలిపొచ్చాము.. మా బాధలు మాపవయ్యా.. కష్టాలు కడతేర్చవయ్యా అంతారు. కానీ ఈయన మాత్రం ఇసిత్రమైన కోరిక కోరినాడులే.. మరేటిమరేటి కాదు.. ఆయన రాజకీయ ప్రత్యర్థి ఫోను ఈమద్దిన పోయిందిలే..ఆ ఫోను గమ్మున దొరికేలా చూడాలని తీరప్తి వెంకన్నను కోరుకున్నాడు.

టీడీపీ మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు ఇందాకే వెంకన్న దర్శనం నుంచి బయటికి వచ్చారు. వస్తూనే మీడియాను చూసి మాట్లాడారు. దుర్మార్గుల‌ పరిపాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడవయ్యా అని కోరుకున్న అయ్యన్న రెండో కోరిక మాత్రం విజయ సాయి ఫోన్ దొరకాలని కోరుకున్నారట.

అసలు సంగతి యేటంటే ఈ ఇద్దరి మధ్య నిత్యం ఉప్పూ నిప్పులాగా ఉంటాది… అయ్యన్న మీద గంజాయి రవాణా.. భూ ఆక్రమణ.. సారాయి అంటూ నిత్యం విజయసాయిరెడ్డి విరుచుకు పడుతుంటారు. అదే తరుణంలో అయ్యన్న కూడా ఏమాత్రం తగ్గకుండా ఏ-2 అని సంభోదిస్తూ ప్రెస్మీట్లు..ప్రకటనలు కామెంట్లు చేస్తుంటారు..ఇది ఉత్తరాంధ్రలో నిత్యకృత్యం..

ఇలాంటి పరిస్థితుల్లో ఆమధ్య అయ్యన్ను అరెస్ట్ చేయడం.. కోర్టులో బెయిల్ రావడం.. ఈ వ్యవహారాన్ని సైతం విజయసాయి తనదైన బాణీలో సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టారు. అయ్యన్న కూడా ఏమీ తగ్గకపోగా ఏ-2 అంటూ తన నాలుక పవరేమిటో చూపిస్తూ వచ్చారు.

ఇలా ఉండగానే ఢిల్లీ లిక్కర్ స్కాములో విజయసాయి రెడ్డి బంధువులకు పాత్ర ఉందని వార్తలు రావడం.. .అనుకున్నట్లుగానే ఆయన సంబంధికులు కొందరి మీద ఈడీ దాడులు చేయడం.. కొన్ని ఆధారాలు సేకరించడం జరిగింది.. దీంతో ఇందులో విజయసాయికి సైతం పాత్ర ఉందని రూమర్స్ వచ్చాయ్.

టీడీపీ అనుకూల మీడియా సైతం ఇదే లైన్ తీసుకుని వార్తలు రాసేయ్.. ఇదిలా ఉండగానే ఈనెల 21న సాయి రెడ్డికి చెందిన ఐఫోన్ ఒకటి ఎక్కడో పోయిందంట్టూ మంగళగిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీని మీద కూడా టీడీపీ అనుకూల సోషల్ మీడియాలో సెటైర్లు.. ట్రోల్స్ మొదలయ్యాయి.

ఆ ఫోన్లో బోలెడు రహస్య సమాచారం ఉందని.. అందుకే దాన్ని ఆయన కావాలనే ఎక్కడో పారేశారని కొందరు.. తన రహస్యాలు బట్టబయలు చేస్తారన్న భయంతో జగన్ ఆ ఫోన్ లాక్కున్నారని కొందరు సెటైర్లు వేశారు. ఏదీ ఏమైనా ఇప్పుడు మళ్లీ ఆ పాయింట్‌ను సాయిరెడ్డి రాజకీయ వైరి అయ్యన్న పాత్రుడు తిరుపతిలో ప్రస్తావించడం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఆ ఫోను దొరకాలని ఆయన వెంకన్నను కోరుకున్నానని చెప్పడాన్ని టీడీపీ అనుకూల సోషల్ మీడియా ఎంజాయ్ చేస్తోంది.