Pilibhit | భర్తను మంచానికి కట్టేసి.. ఐదు ముక్కలుగా నరికేసిన భార్య
Pilibhit విధాత: ఓ భార్య.. తన భర్తను అత్యంత దారుణంగా నరికి చంపింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫిలిబిత్ జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఫిలిబిత్ జిల్లాలోని గజ్రౌలా ఏరియాకు చెందిన రామ్ పాల్(55), తన భార్య దులారో దేవితో కలిసి ఉంటున్నాడు. వీరికి కుమారుడు, కోడలు ఉన్నారు. అయితే నెల రోజుల క్రితం దులారో దేవి తన భర్త స్నేహితుడితో కలిసి వెళ్లిపోయింది. ఇంటికి తిరిగొచ్చిన దేవీ.. రామ్ పాల్ అదృశ్యమైనట్లు తమకు సమీపంలో […]

Pilibhit
విధాత: ఓ భార్య.. తన భర్తను అత్యంత దారుణంగా నరికి చంపింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫిలిబిత్ జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఫిలిబిత్ జిల్లాలోని గజ్రౌలా ఏరియాకు చెందిన రామ్ పాల్(55), తన భార్య దులారో దేవితో కలిసి ఉంటున్నాడు. వీరికి కుమారుడు, కోడలు ఉన్నారు.
అయితే నెల రోజుల క్రితం దులారో దేవి తన భర్త స్నేహితుడితో కలిసి వెళ్లిపోయింది. ఇంటికి తిరిగొచ్చిన దేవీ.. రామ్ పాల్ అదృశ్యమైనట్లు తమకు సమీపంలో ఉంటున్న కుమారుడు, కోడలికి సమాచారం అందించింది.
దులారో దేవీ ప్రవర్తనపై అనుమానం రావడంతో కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దేవీని అదుపులోకి తీసుకుని విచారించగా, చేసిన నేరాన్ని అంగీకరించింది.
గత ఆదివారం రాత్రి నిద్రిస్తున్న భర్తను అదే మంచానికి కట్టేసి, గొడ్డలితో నరికి చంపినట్లు ఒప్పుకుంది. ఐదు శరీర భాగాలను సమీపంలో ఉన్న కాలువలో పడేసినట్లు పోలీసులకు తెలిపింది. దీంతో రామ్ పాల్ శరీర భాగాల కోసం కాలువలో పోలీసులు గాలిస్తున్నారు.