Pink WhatsApp | పింక్ వాట్సాప్‌ను డౌన్లోడ్ చేశారా..? వెంటనే డిలీట్ చేయండి..! లేకపోతే డేంజర్లో ఉన్నట్టే..!
Pink WhatsApp | రోజు రోజుకు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త మార్గాల్లో బురిడీ కొట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే వాట్సాప్‌కు నకిలీ సందేశాలు, కాల్స్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. వాట్సాప్ పేరుతో మరో స్కామ్ చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. లేటెస్ట్ వాట్సాప్ పింక్ వర్షన్ వచ్చిందని, డౌన్లోడ్ చేసుకోవాలంటూ లింక్స్ పంపుతూ మోసాలకు పాల్పడుతున్నారు. అయితే, పింక్ వాట్సాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటూ వచ్చే లింక్స్‌ను ఎట్టి పరిస్థితిల్లో ఓపెన్ చేయొద్దని ముంబయి సైబర్ క్రైమ్ వింగ్ […]

Pink WhatsApp | రోజు రోజుకు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త మార్గాల్లో బురిడీ కొట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే వాట్సాప్‌కు నకిలీ సందేశాలు, కాల్స్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. వాట్సాప్ పేరుతో మరో స్కామ్ చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది.
లేటెస్ట్ వాట్సాప్ పింక్ వర్షన్ వచ్చిందని, డౌన్లోడ్ చేసుకోవాలంటూ లింక్స్ పంపుతూ మోసాలకు పాల్పడుతున్నారు. అయితే, పింక్ వాట్సాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటూ వచ్చే లింక్స్‌ను ఎట్టి పరిస్థితిల్లో ఓపెన్ చేయొద్దని ముంబయి సైబర్ క్రైమ్ వింగ్ పోలీసులు సూచిస్తున్నారు.
వాస్తవానికి వాట్సాప్‌లో పింక్ వాట్సాప్ అనేదే లేదు. ప్రస్తుతం ఎక్కువగా వాట్సాప్ వాడుతున్నారు. మెటా యాజమాన్యంలో కంపెనీ కొత్త కొత్త ఫీచర్స్ యూజర్లను ఆకట్టుకుంటున్నది. ఈ అదునుగా తీసుకుంటున్న సైబర్ నేరగాళ్లు పింక్ వాట్సాప్ పేరుతో లింక్స్‌ను పంపుతూ దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలని కోరుతున్నారు.
ఆ లింక్‌పై క్లిక్ చేస్తే హ్యాకర్లు పంపిన మాల్వేర్ ఫోన్లోకి చొరబడి.. ఫోన్‌ను హ్యాక్ చేస్తుంది. కాంటాక్టులతో పాటు ఫొటోలు, వీడియోలను యాక్సెస్ చేయడంతో పాటు బ్యాకింగ్ యాప్స్‌ను సైతం హ్యాకింగ్ బారినపడతాయి.
డౌన్లోడ్ చేస్తే ఇలా చేయండి..
ఇప్పటికే ఎవరైనా పింక్ వాట్సాప్‌ను డౌన్లోడ్ చేస్తే వెంటనే దాన్ని డిలీట్ చేయాలి. ఈ స్టెప్స్‌ను అనుసరించి.. ఫోన్లో నుంచి పూర్తిగా వైరస్‌ను పూర్తిగా డిలీట్ చేసుకోండి. మొదట సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. ఆ తర్వాత యాప్స్‌ను సెలెక్ట్ చేయాలి. అందులో పింక్ వాట్సాప్ కనిపిస్తే సెలెక్ట్ చేయాలి.
అనంతరం యాప్‌ను డిలీట్ చేయాలి. సెట్టింగ్‌లోకి వెళ్లి బ్రౌజర్ క్యాచ్‌ని క్లియర్ చేయాలి. అయితే, ఎప్పుడు కానీ ఎదైనా యాప్స్‌ను ఇన్స్టాల్ చేయాలనుకుంటే గూగుల్ ప్లే స్టోర్ లేదంటే యాపిల్ యాప్ స్టోర్ నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకుంటే మంచిదని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.
గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింక్స్ ద్వారా ఎట్టి పరిస్థితుల్లో యాప్ డౌన్లోడ్ చేసుకోవద్దని, అపరిచిత వ్యక్తులకు, అనుమానాస్పద వ్యక్తులకు వ్యక్తిగత, బ్యాకింగ్ వివరాలు చెప్పొద్దని సైబర్ నిపుణులు చెబుతున్నారు. అనుమానాస్పద లింక్స్‌ను, సోషల్ మీడియాలో ఆఫర్ల పేరిట వచ్చే లింక్స్, ఏపీకే ఫైల్స్‌ను మొబైల్లో ఇన్స్టాల్ చేయొద్దని నిపుణులు సూచిస్తున్నారు.