తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. మంగళవారం సంగారెడ్డిలో 7వేల కోట్లతో సంగారెడ్డి నుంచి రూ.7,200కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

- ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టీకరణ
- సంగారెడ్డిలో 7వేల కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం
- సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళిని దర్శించుకున్న ప్రధాని
విధాత : తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. మంగళవారం సంగారెడ్డిలో 7వేల కోట్లతో సంగారెడ్డి నుంచి రూ.7,200కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మోదీ మాట్లాడుతూ నిన్న ఆదిలాబాద్‌లో 7వేల కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించామని గుర్తు చేశారు. దేశంలోనే తొలి ఏవియేషన్ సెంటర్‌ను బేగంపేటలో ఏర్పాటు చేశామన్నారు. ఎఎవియేషన్ రంగంలో తెలంగాణకు లబ్ది చేకూరుతుందన్నారు. ఈ సంస్థ వల్ల తెలంగాణ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని పేర్కోన్నారు.
బడ్జెట్ లో మౌళిక సదుపాయాల కోసం రూ.11 లక్షల కోట్లు కేటాయించామన్నారు. రాష్ట్రాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని చెప్పారు. పదేళ్లలో దేశంలో ఎయిర్ పోర్ట్‌ల సంఖ్య రెట్టింపు అయిందని వెల్లడించారు. వికసిత్ భారత్ దిశగా తమ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ఇవాళ రెండో రోజు తెలంగాణ ప్రజలతో ఉండటం సంతోషంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు పాల్గొన్నారు.

ఉజ్జయిని మహంకాళిని దర్శించుకున్న ప్రధాని మోదీ
తెలంగాణలో ప్రధాని నరేంద్రమోదీ రెండో రోజు పర్యటనలో భాగంగా మంగళవారం సికింద్రాబాద్‌లోని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. తొలుత ఆలయం వద్దకు చేరుకున్న ప్రధానికి అర్చకులు, వేదపండితులు ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారి గుత్తా మనోహర్‌రెడ్డి ఆయనకు అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఆలయ పరిసర ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మహంకాళి అమ్మవారి దర్శనం తర్వాత సంగారెడ్డి పర్యటనకు మోదీ బయల్దేరారు. బేగంపేట విమానాశ్రయం నుంచి సంగారెడ్డికి హెలిక్యాపక్టర్‌లో వెళ్లారు.