మచిలీపట్నంలో పోలీసుల దాష్టీకం.. బట్టలూడదీసి చితకబాదిన వైనం
విధాత: ప్రాణాపాయ స్థితిలో ఉన్న విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు మద్దతుగా నిలిచిన ఎస్‌ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పవన్ కుమార్‌పై మచిలీ పట్నం పోలీసులు దాష్టికానికి పాల్పడ్డారు. కృష్ణా యూనివర్సిటీ వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఇటీవల కరెంటుషాక్‌కు గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఇద్దరు విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని యూనివర్సిటీ వద్ద ఎస్ఎఫ్ఐ నాయత్వంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. విద్యార్థుల ఆందోళనకు నాయకత్వం వహించిన పవన్ కుమార్ వీసీ చాంబర్ పక్క రూమ్‌లో […]

విధాత: ప్రాణాపాయ స్థితిలో ఉన్న విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు మద్దతుగా నిలిచిన ఎస్‌ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పవన్ కుమార్‌పై మచిలీ పట్నం పోలీసులు దాష్టికానికి పాల్పడ్డారు. కృష్ణా యూనివర్సిటీ వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఇటీవల కరెంటుషాక్‌కు గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఇద్దరు విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని యూనివర్సిటీ వద్ద ఎస్ఎఫ్ఐ నాయత్వంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు.
విద్యార్థుల ఆందోళనకు నాయకత్వం వహించిన పవన్ కుమార్ వీసీ చాంబర్ పక్క రూమ్‌లో కూర్చొని ఉండగా ఎస్ఐ తన సిబ్బందితో వచ్చి పవన్ ఒంటిపై బట్టలు ఊడదీసి విచక్షణా రహితంగా చితక బాదారు.
పవన్ ఒంటిపై బట్టలు ఊడదీసి, పైఅంతస్థు నుంచి కింది వరకు లాక్కొచ్చారని విద్యార్థులు ఆరోపించారు. ఆ తరువాత యూనివర్సిటీ మెయిన్ డోర్ మూసి వేసి పవన్‌ను చితక బాదారని వాపోయారు. పోలీసుల ముష్టి దాడిలో సొమ్మ సిల్లి పడిపోయిన పవన్‌ను ఆసుపత్రికి తరలించేందుకు అంబులెన్స్‌ను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తే రాకుండా పోలీసులు అడ్డుకున్నారని ఎస్ఎఫ్ఐ నేతలు ఆరోపించారు.