Ponnala Lakshmaiah | కేసీఆర్.. ఫామ్ హౌస్ నుంచి చర్లపల్లికే: పొన్నాల లక్ష్మయ్య
Ponnala Lakshmaiah తెలంగాణను దోచుకున్నందుకు శిక్షతప్పదు బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒకటే కాంగ్రెస్ సభ దృష్టి మళ్ళించేందుకు ఈడీ నోటీసులు పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ఫైర్ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి డైరెక్ట్ గా చర్లపల్లి సెంట్రల్ జైలుకే వెళుతారని పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య హెచ్చరించారు. హనుమకొండలో శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తెలంగాణా […]

Ponnala Lakshmaiah
- తెలంగాణను దోచుకున్నందుకు శిక్షతప్పదు
- బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒకటే
- కాంగ్రెస్ సభ దృష్టి మళ్ళించేందుకు ఈడీ నోటీసులు
- పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ఫైర్
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి డైరెక్ట్ గా చర్లపల్లి సెంట్రల్ జైలుకే వెళుతారని పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య హెచ్చరించారు. హనుమకొండలో శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తెలంగాణా ఆస్తులను దోచుకున్న కేసీఆర్, ఆయన కుటుంబాన్ని జైల్లో పెడుతామని, ఇది ప్రజాశిక్ష అని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరు మీద వేల కోట్లు దోచుకున్నాడు కేసీఆర్… రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు మీద నైనా చర్చకు రమ్మన్నా పారిపోతున్నాడని విమర్శించారు. 2014 నుంచి కేసీఆర్ పెట్టిన పబ్లిక్ మీటింగ్లో, తెలంగాణ కేసీఆర్ తీసుకొచ్చిన అని చెప్పిండా? ఇద్దరు ఎంపీలతో తెలంగాణా వస్తుందా? అంటూ ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒకటే గూటికి చెందినవని విమర్శించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసపూరిత ప్రచారాలతో ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు. రాజకీయ లబ్ధి గురించే సెప్టెంబర్ 17ను ఆ రెండు పార్టీలు వాడుకుంటున్నాయని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఈ నెల 16, 17 తేదీలో నిర్వహించే సమావేశం దేశ, రాష్ట్ర రాజకీయాలకు దిక్సూచిగా మారనున్నదని చెప్పారు. ఇక్కడి నుండే ఎన్నికల శంఖారావం పురించబోతున్నామని అన్నారు.
మూడు సార్లు నోటీసులిచ్చి అరెస్టు చేయలేదు..
కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యుసీ సమావేశాలు, సభ దృష్టి మరల్చడానికే కవితకు ఈడీ నోటీసులిచ్చారని పొన్నాల విమర్శించారు. ఇప్పటికే మూడు సార్లు కవితకు నోటీసులు పంపితే , మరి ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. మోడీ 2014 లో ఏవిధంగా వచ్చిండు ..15 లక్షలు ఇస్తానని అన్నాడు, రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని అన్నాడు. నల్ల ధనం రూపు మాపుతానని అన్నాడు. ఉద్యోగాలు కల్పించిండా? 15 లక్షలు ఇచ్చిండా? 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిండా? అని పొన్నాల ప్రశ్నించారు.
ఈ సమావేశంలో హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి, పీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాస్ రావు, టీపీసీసీ మాజీ కార్యదర్శి ఈవీ శ్రీనివాస్ రావు, మాజీ కార్పొరేటర్ నసీం జాహన్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ, పల్లకొండ సతీష్, గుంటి స్వప్న, బాలు నాయక్ పాల్గొన్నారు.