Popcorn Rate | సినీ ప్రియులకు గుడ్‌న్యూస్‌..! థియేటర్లలో తగ్గనున్న పాప్‌కార్న్‌ ధరలు..!

Popcorn Rate | ప్రస్తుతం కుటుంబం కలిసి సినిమా థియేటర్లకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. కారణం సినిమా టికెట్ల ధరల కంటే.. విరామం సమయంలో పాప్‌కార్నర్‌, కూల్‌డ్రింక్స్‌ తదితర వాటికి అయ్యే ఖర్చే అధికంగా ఉంటుంది. దాంతో సినిమా థియేటర్లకు వెళ్లేందుకు వెనుకడుగు వేస్తున్నారు. సాధారణ థియేటర్లతో పోలిస్తే మల్టీ ప్లెక్సుల్లో ఛార్జీలు విపరీతంగా ఉంటున్నాయి. తినుబండారాల ధరలు ఐదారురెట్లు ఎక్కువగా ఉంటున్నాయి. 50 గ్రాముల పాప్‌కార్న్‌కు రూ.500లకుపైగా వసూలు చేస్తుండ డంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధిక ధరలతోనే […]

Popcorn Rate | సినీ ప్రియులకు గుడ్‌న్యూస్‌..! థియేటర్లలో తగ్గనున్న పాప్‌కార్న్‌ ధరలు..!

Popcorn Rate |

ప్రస్తుతం కుటుంబం కలిసి సినిమా థియేటర్లకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. కారణం సినిమా టికెట్ల ధరల కంటే.. విరామం సమయంలో పాప్‌కార్నర్‌, కూల్‌డ్రింక్స్‌ తదితర వాటికి అయ్యే ఖర్చే అధికంగా ఉంటుంది. దాంతో సినిమా థియేటర్లకు వెళ్లేందుకు వెనుకడుగు వేస్తున్నారు.

సాధారణ థియేటర్లతో పోలిస్తే మల్టీ ప్లెక్సుల్లో ఛార్జీలు విపరీతంగా ఉంటున్నాయి. తినుబండారాల ధరలు ఐదారురెట్లు ఎక్కువగా ఉంటున్నాయి. 50 గ్రాముల పాప్‌కార్న్‌కు రూ.500లకుపైగా వసూలు చేస్తుండ డంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధిక ధరలతోనే ఫ్యామిలీ ఆడియెన్స్‌ థియేటర్లకు దూరమవుతున్నారనే వాదనలు సైతం లేకపోలేదు.

ఈ ధరలకు తోడు జీఎస్టీ సైతం జతకావడంతో భారం మరింత ఎక్కువవుతున్నది. అయితే, అధిక ధరల నుంచి ప్రేక్షకులకు ఉపశమనం కలిగించే చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. ప్రస్తుం థియేటర్లలో ఫుడ్‌ ఐటమ్స్‌పై జీఎస్టీ 18శాతం స్లాబ్‌లో ఉందని తెలుస్తుండగా.. దీన్ని 5 శాతానికి తగ్గించేందుకు జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

తినుబండారాల ధరలతో సినిమా, థియేటర్‌ వ్యవస్థకు జరుగుతున్న నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని జీఎస్టీని తగ్గించేందుకు నిర్ణయించినట్లు తెలుస్తున్నది. త్వరలోనే ఇందుకు సంబంధించి కీలక ప్రకటన చేసే అవకాశాలున్నాయని తెలుస్తున్నది.

మరో వైపు రూ.20 వరకు ధరలు తగ్గే అవకాశం ఉందని, ఇంకా ధరలు తగ్గేలా చూడాలని పలువురు కోరుతున్నారు. మరో వైపు ఓటీటీల కారణంగా థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో ఫుడ్‌ ఐటమ్స్‌ ద్వారా అదనపు ఆదాయం సమకూర్చుకుంటున్నట్లు పేర్కొంటున్నాయి.