నల్గొండ నియోజకవర్గంలో ప్రజాగోస బైక్ యాత్ర: మాదగోని
విధాత. నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఈ నెల 9 నుంచి ప్రజా గోస.. భరోసా బైక్ యాత్ర నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. ఆదివారం అయన జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నల్గొండ నియోజకవర్గాన్ని సీఎం కేసీఆర్ దత్తతకు తీసుకొని అభివృద్థి చేస్తానని చెప్పి నేటికి నాలుగు సంవత్సరాల అవుతుందని, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లయినా ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదని […]

విధాత. నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఈ నెల 9 నుంచి ప్రజా గోస.. భరోసా బైక్ యాత్ర నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. ఆదివారం అయన జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నల్గొండ నియోజకవర్గాన్ని సీఎం కేసీఆర్ దత్తతకు తీసుకొని అభివృద్థి చేస్తానని చెప్పి నేటికి నాలుగు సంవత్సరాల అవుతుందని, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లయినా ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదని విమర్శించారు.
టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడుతున్న బీజేపీ కార్యకర్తలను కేసుల పాలు చేస్తున్నారన్నారు. ధరణితో రైతాంగాన్ని అనేక ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు.. వివాదాల్లో ఉన్న పేదల భూములను, ప్రభుత్వ భూములను టీఆర్ఎస్ నాయకులు లాక్కొంటున్నారని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ నుంచి
కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి నాలుగు సార్లు గెలిచినా ఈ నియోజకవర్గం అభివృద్ధి జరగలేదని టీఆర్ఎస్ నుంచి కంచర్ల భూపాల్ రెడ్డినీ గెలిపిస్తే నల్గొండను దత్తత తీసుకుంటా అని గత ఎన్నికల్లో చెప్పిన సీఎం కేసీఆర్ నాలుగు సంవత్సరాలు అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం వహించారని విమర్శించారు.
ఎన్నికలు సమీపించడంతో హడావుడిగా అభివృద్ధి పనులను ప్రకటించి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారన్నారు. నియోజకవర్గంలో ఎక్కడా డబల్ బెడ్రూమ్ ఇండ్లు ప్రజలకు ఇవ్వలేదన్నారు. నియోజకవర్గంకు సాగు తాగు నీరందించే ఎస్ఎల్బీసీ, ఉదయ సముద్రం ప్రాజెక్టులకు నిధులు ఇవ్వకుండా మూలన పడేసారన్నారు. నియోజకవర్గంలో వేల మంది నిరుద్యోగులు నిరుద్యోగ భృతి కోసం రైతులు రుణమాఫీ కోసం, పేదలు డబుల్ బెడ్ రూమ్‌ల కోసం ఎదురుచూస్తున్నారన్నారు.
టీఆర్ఎస్ పాలనలో విద్యార్థులకు మంచి చదువు, హాస్టల్ వసతి, భోజనం కూడా కరువైందన్నారు. నియోజకవర్గంలో రోడ్లు అద్వాన్నంగా మారాయని, రోడ్లకు ప్రభుత్వం ఆర్అండ్ బీ నిధులు ఇవ్వకుండా మున్సిపాలిటీ నిధులతో పనులు చేయిస్తుందన్నారు. నల్గొండ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఇంతవరకు ఎన్ని నిధులు ఇచ్చారో శ్వేత పత్రం వెల్లడించాలన్నారు. శాసనమండలి చైర్మన్ గా రాజ్యాంగ పదవిలో ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి తరచూ రాజకీయ విమర్శలు చేస్తూ తన పరిధిని అతిక్రమించడం హోదాను దిగజార్చి చిల్లర రాజకీయ ప్రకటనలు చేయడం మానుకోవాలని డిమాండ్ చేశారు.
నల్గొండ నియోజకవర్గం ప్రజా సమస్యల పై 9నుండి బీజేపీ చేపట్టిన ప్రజాగోస బీజేపీ భరోసా యాత్రకు ప్రజలు యువత మహిళలు పెద్ద ఎత్తున కలిసి రావాలని శ్రీనివాస్ గౌడ్ కోరారు ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు వీరెల్లి చంద్రశేఖర్, నల్గొండ పార్లమెంట్ కన్వీనర్ బండారు ప్రసాద్,బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల రాజశేఖర్ రెడ్డి, బిజెపి రాష్ట్ర నాయకులు నూకల వెంకట్ నారాయణ రెడ్డీ, కన్వీనర్ దాయం భూపాల్ రెడ్డి, పాలకూరి రవి గౌడ్ ,మోరిశేట్టి నాగేశ్వర్ రావు, చర్లపల్లి గణేష్, అవుల మధు, గడ్డం మహేష్, దుబ్బాక సాయి తదితరులు పాల్గొన్నారు