క‌ర్ణాట‌క‌ బీఆర్ఎస్ ఇన్‌ఛార్జిగా ప్రకాష్‌రాజ్‌?

విధాత‌: భారతీయ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసిన కేసీఆర్ ఆ పార్టీ తరఫున పొరుగు రాష్ట్రాల్లోనూ పోటీ చేసి, పార్టీని జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు అడుగులు వేస్తున్నారు. ఈమేరకు తన పరిచయాలు, పరపతిని వినియోగించుకుని పార్టీని విస్తృతం చేసేందుకు యత్నాలు మొదలు పెట్టారు. అయితే నిన్న బీఆర్ఎస్ జాతీయ పార్టీగా ఆవిర్భవించి, పార్టీ పేరు జెండా ఆవిష్కరించిన వేళ కేసీఆర్ పక్కన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, ఇంకా సినీనటుడు ప్రకాష్ రాజ్ కూడా ఉన్నారు. అంతేకాకుండా […]

  • By: krs    latest    Dec 10, 2022 12:04 PM IST
క‌ర్ణాట‌క‌ బీఆర్ఎస్ ఇన్‌ఛార్జిగా ప్రకాష్‌రాజ్‌?

విధాత‌: భారతీయ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసిన కేసీఆర్ ఆ పార్టీ తరఫున పొరుగు రాష్ట్రాల్లోనూ పోటీ చేసి, పార్టీని జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు అడుగులు వేస్తున్నారు. ఈమేరకు తన పరిచయాలు, పరపతిని వినియోగించుకుని పార్టీని విస్తృతం చేసేందుకు యత్నాలు మొదలు పెట్టారు.

అయితే నిన్న బీఆర్ఎస్ జాతీయ పార్టీగా ఆవిర్భవించి, పార్టీ పేరు జెండా ఆవిష్కరించిన వేళ కేసీఆర్ పక్కన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, ఇంకా సినీనటుడు ప్రకాష్ రాజ్ కూడా ఉన్నారు. అంతేకాకుండా ప్రకాష్ రాజ్ కొన్నేళ్లుగా కేసీఆర్‌తో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. తెలంగాణలో కొన్ని పల్లెలను దత్తత తీసుకుని అభివృద్ధి పనులు కూడా చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ప్రకాష్‌రాజ్‌కు బీఆర్ఎస్‌లో కొన్ని రాష్ట్రాల బాధ్యతలు ఇస్తారని అంటున్నారు. భారతీయ రాష్ట్ర సమితికి కన్నడ, తమిళనాడు బాధ్యతలు ప్రకాష్ రాజ్‌కి అప్పగిస్తారని అంటున్నారు. ఆయనకు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో విస్తృతంగా పరిచయాలు, పలుకుబడి ఉన్నాయి. దీంతో ఆ రెండు రాష్ట్రాల్లో ఆయన పార్టీకి ఉపయోగపడతారని కేసీఆర్ భావిస్తున్నారు.

అయితే ప్రకాష్‌రాజ్‌ 2019 ఎన్నికల్లో బెంగుళూరు సెంట్రల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడారు. ఆయన బీజేపీ వ్యతిరేక భావజాలం నిండా నింపుకున్న వ్యక్తి కావడంతో కేసీఆర్‌కు మరింత దగ్గరయ్యారు. వచ్చే ఏడాది కర్నాటకలో శాసనసభ ఎన్నికలు జరుగుతున్నాయి. దాంతో కర్నాటక బీఆర్ఎస్ చీఫ్‌గా ప్రకాష్‌రాజ్‌ని నియమిస్తారని, అక్కడ బీఆర్ఎస్‌, జేడీఎస్ కలిసి పోటీ చేస్తాయని చెబుతున్నారు.

ఇక చాలా కాలంగా కేసీఆర్‌తో ప్రకాష్ రాజ్ కలిసి ప్రయాణం చేస్తున్నారు. ఆ మధ్య మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేని కలవడానికి ముంబై వెళ్ళినపుడు, ఎన్సీపీ నేత శరద్ పవార్‌ని కలుసుకున్నపుడు కూడా కేసీఆర్ పక్కన ప్రకాష్‌రాజ్‌ ఉన్నారు. ఏదైతేనేం ఇప్పటికే సినీ నటుడిగా అందరికి బాగా పరిచయం ఇన్న ప్రకాష్ రాజ్ తమ పార్టీకి బాగా ఉపయోగ పడతారని కేసీఆర్ భావిస్తున్నారు.