Praveen Kumar | నుజ్జునుజ్జైన కారు.. పెద్ద ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డ్డ టీమిండియా మాజీ పేస‌ర్

Praveen Kumar | భారత క్రికెట్ జట్టు మాజీ పేసర్, ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన ప్రవీణ్ కుమార్ గురించి క్రికెట్ ప్రియుల‌కి త‌ప్ప‌క తెలిసే ఉంటుంది.ఆయ‌న‌కి తాజాగా పెద్ద ప్ర‌మాదం త‌ప్పింది. క్రికెట్ నుండి త‌ప్పుకున్న త‌ర్వాత ఆయ‌న మీర‌ట‌ల్‌లోని ముల్తాన్ న‌గ‌ర్‌లో ఉంటున్నారు. అయితే మంగ‌ళ‌వారం రాత్రి త‌న కొడుకుతో ల్యాండ్ రోవ‌ర్ కారులో పాండవ్ నగర్ నుంచి బాగ్పట్ కు వస్తుండగా ఆయన కారుకి ప్రమాదం సంభవించింది. భారీ […]

  • By: sn    latest    Jul 05, 2023 9:22 AM IST
Praveen Kumar | నుజ్జునుజ్జైన కారు.. పెద్ద ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డ్డ టీమిండియా మాజీ పేస‌ర్

Praveen Kumar | భారత క్రికెట్ జట్టు మాజీ పేసర్, ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన ప్రవీణ్ కుమార్ గురించి క్రికెట్ ప్రియుల‌కి త‌ప్ప‌క తెలిసే ఉంటుంది.ఆయ‌న‌కి తాజాగా పెద్ద ప్ర‌మాదం త‌ప్పింది. క్రికెట్ నుండి త‌ప్పుకున్న త‌ర్వాత ఆయ‌న మీర‌ట‌ల్‌లోని ముల్తాన్ న‌గ‌ర్‌లో ఉంటున్నారు.

అయితే మంగ‌ళ‌వారం రాత్రి త‌న కొడుకుతో ల్యాండ్ రోవ‌ర్ కారులో పాండవ్ నగర్ నుంచి బాగ్పట్ కు వస్తుండగా ఆయన కారుకి ప్రమాదం సంభవించింది. భారీ లోడ్ తో వస్తున్న ఓ ట్రక్కు.. మూల మలుపు వ‌ద్ద ప్ర‌వీణ్ కారుని ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జు అయింది.

ప్రమాదంలో ప్రవీణ్ కుమార్ ప్రయాణిస్తున్న కారు పూర్తిగా దెబ్బతిన్నా కూడా ప్రవీణ్, అతడి కుమారుడు పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ప్ర‌మాదం గురించి తెలుసుకున్న‌ పోలీసులు వెంట‌నే ప్ర‌మాద స్థ‌లికి చేరుకొని ట్రక్కు డ్రైవర్‌ను అరెస్ట్ చేసినట్టుగా స‌మాచారం.

ఇక ప్రవీణ్ కుమార్‌తో పాటు అతడి కొడుకును స్థానికులు త్వ‌ర‌గా ఆసుప‌త్రికి త‌ర‌లించ‌డంతో వారు క్షేమంగా బ‌య‌ట‌ప‌డ్డారు. ప్రవీణ్ కుమార్, అతడి కొడుకుకి ఎలాంటి ప్రమాదం లేద‌ని మాజీ పేసర్ కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక ప్ర‌వీణ్ కుమార్ కూడా పీటీఐతో మాట్లాడిన‌ట్టు తెలుస్తుంది.

ఇది దారుణ‌మైన యాక్స‌డెంట్. దేవుడి దయ వల్ల మేము క్షేమంగానే ఉన్నాము. మా కుటుంబంలో ఒకరిని డ్రాప్ చేయడానికి వెళుతుండ‌గా, రాత్రి 9:30 గంటల ప్రాంతంలో ఒక భారీ ట్రక్కు నా కారును వెనుక నుంచి బ‌లంగా ఢీకొట్టింది. దేవునికి ఎంత కృత‌జ్ఞ‌త‌లు చెప్పిన త‌క్కువే. అది ఒక పెద్ద కారు కాబ‌ట్టి పెద్ద‌గా ఏమి కాలేదు. లేదంటే బాగానే గాయాలు అయ్యి ఉండేవి అని ప్రవీణ్ కుమార్ స్ప‌ష్టం చేశారు.

ఇక త‌న కారు బంపర్ విరిగిపోయిందని ముందు తాను భావించానని, చూశాక మాత్రం కారు మొత్తం దెబ్బతిందని తెలిపారు. ప్ర‌వీణ్ ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ ప‌డ‌డంతో ప్ర‌తి ఒక్క‌రు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఇదిలా ఉంటే గత ఏడాది జూన్‌లో రిషబ్ పంత్‌కు ఘోర రోడ్డు ప్ర‌మాదం జరిగిన విష‌యం తెలిసిందే. అయితే ప్రవీణ్‌ కుమార్‌ 2007 నుంచి 2012 వ‌ర‌కు ఇండియన్ క్రికెట్‌ టీంలో కీలక ఆటగాడిగా ఉన్నాడు.