కేంద్రంపై మరోసారి రైతన్నల పోరుబాట..! ఢిల్లీలో ఆందోళనలకు సన్నాహాలు..!!
Kisan Andolan : దేశ రాజధాని ఢిల్లీలో మరోసారిపెద్ద ఎత్తున రైతుల ఉద్యమానికి సన్నాహాలు జరుగుతున్నాయి. యునైటెడ్ కిసాన్ మోర్చా పిలుపు మార్చి 20న పార్లమెంట్ ముట్టడికి సన్నద్ధనమవుతున్నారు. వచ్చే ఏడాది జనవరి 26న దేశవ్యాప్తంగా ట్రాక్టర్లతో కవాతు నిర్వహించనున్నట్లు భకియు ప్రతినిధి రాకేశ్ టికాయిత్ పేర్కొన్నారు. హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. భూమిని, రాబోయే తరాలను కాపాడుకునేందుకు రైతులు 20 ఏళ్ల పాటు ఆందోళనకు సిద్ధంగా ఉండాలన్నారు. రైతులకు కావాల్సింది రుణాలు కావని, […]

Kisan Andolan : దేశ రాజధాని ఢిల్లీలో మరోసారిపెద్ద ఎత్తున రైతుల ఉద్యమానికి సన్నాహాలు జరుగుతున్నాయి. యునైటెడ్ కిసాన్ మోర్చా పిలుపు మార్చి 20న పార్లమెంట్ ముట్టడికి సన్నద్ధనమవుతున్నారు. వచ్చే ఏడాది జనవరి 26న దేశవ్యాప్తంగా ట్రాక్టర్లతో కవాతు నిర్వహించనున్నట్లు భకియు ప్రతినిధి రాకేశ్ టికాయిత్ పేర్కొన్నారు. హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. భూమిని, రాబోయే తరాలను కాపాడుకునేందుకు రైతులు 20 ఏళ్ల పాటు ఆందోళనకు సిద్ధంగా ఉండాలన్నారు. రైతులకు కావాల్సింది రుణాలు కావని, ఎంఎస్‌ఎపీపై హామీ చట్టం కావాలన్నారు.
ఢిల్లీలోని ప్రభుత్వ ఇంటర్ కళాశాల మైదానంలో నిర్వహించిన కిసాన్ మజ్దూర్ మహా పంచాయత్‌లో రెండు విడుత ఆందోళనను ప్రకటించారు. సంయుక్త కిసాన్ మోర్చా, భారతీయ కిసాన్ యూనియన్, హర్యానా, యూపీకి చెందిన ఖాప్ చౌదరీ చర్చల అనంతరం ఎంఎస్‌పీ హామీచట్టం కోసం దేశవ్యాప్తంగా ఉన్న రైతులు పార్లమెంట్ భవనం వద్ద మహా పంచాయత్‌ను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అన్ని రాష్ట్రాలకు చెందిన రైతులు ఢిల్లీకి వస్తారన్నారు.
ఈ మేరకు సన్నాహాలకు భకియు, యునైటెడ్ కిసాన్ మోర్చా నాయకులు సన్నాహాల కోసం దేశవ్యాప్తంగా పర్యటించనున్నట్లు భకియు జాతీయ ప్రధాన కార్యదర్శి యుధ్వీర్ సింగ్ పేర్కొన్నారు. దేశంలో ప్రభుత్వం, నాగ్‌పూర్ కంపెనీల విధానం నడుస్తోందని రాకేశ్ టికాయిత్ విమర్శించారు. రైతుల వ్యవసాయ పొలాలకు కరెంటు మీటర్లు బిగిస్తే ఊరుకునేది లేదని.. ఇందుకు పోలీసులు, అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. బావులకు మీటర్లు బిగించడం మానుకోవాలని భకియు ప్రతినిధి డిమాండ్ చేశారు.