President Murmu | చందమామపై భారత్ పరుగు.. ఇస్రోకు రాష్ట్రపతి అభినందన
విక్రమ్ ల్యాండర్ నుంచి బయటకొచ్చిన రోవర్ అధ్యయనాన్ని ప్రారంభించిన రోవర్ చంద్రయాన్-3 అన్ని దశలు సూపర్ సక్సెస్ ఇస్రోకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు President Murmu | విధాత: భారత్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం అన్నిసూపర్ సక్సెస్ అయింది. చంద్రుడిపై బుధవారం రాత్రి 6.04 గంటలకు విక్రమ్ ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువం ఉపరితలంపై సాఫీగా దిగింది. నాలుగు గంటల తర్వాత ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వచ్చింది. I once again congratulate […]

- విక్రమ్ ల్యాండర్ నుంచి బయటకొచ్చిన రోవర్
- అధ్యయనాన్ని ప్రారంభించిన రోవర్
- చంద్రయాన్-3 అన్ని దశలు సూపర్ సక్సెస్
- ఇస్రోకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు
President Murmu |
విధాత: భారత్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం అన్నిసూపర్ సక్సెస్ అయింది. చంద్రుడిపై బుధవారం రాత్రి 6.04 గంటలకు విక్రమ్ ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువం ఉపరితలంపై సాఫీగా దిగింది. నాలుగు గంటల తర్వాత ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వచ్చింది.
I once again congratulate the ISRO team and all fellow citizens for successful deployment of Pragyan-rover from inside Vikram-lander. Its rolling out a few hours after the landing of Vikram marked the success of yet another stage of Chandrayan 3. I look forward with excitement,…
— President of India (@rashtrapatibhvn) August 24, 2023
ఇప్పుడు రోవల్ చంద్రుని ఉపరితలంపై కదలడం మొదలు పెట్టింది. అధ్యయనానికి శ్రీకారం చుట్టింది. చందమామపై భారత్ నడిచినట్టుగా ఇస్రో వర్గాలు గురువారం వెల్లడించాయి. ప్రజ్ఞాన్ రోవర్‌ని విజయవంతంగా ప్రయోగించినందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇస్రోను మరో అభినందించారు.
“విక్రమ్-ల్యాండర్ లోపల నుంచి ప్రజ్ఞాన్-రోవర్‌ను విజయవంతంగా బయటకు తీసుకొచ్చి అధ్యయనం ప్రారంభించినందుకు ఇస్రో బృందానికి, తోటి పౌరులందరికీ నేను మరోసారి అభినందనలు తెలియజేస్తున్నాను. విక్రమ్ ల్యాండింగ్ అయిన కొన్ని గంటల తర్వాత చంద్రయాన్- 3 మరో దశ విజయవంతమైంది.”అని ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గురువారం ఉదయం ట్విట్టర్లో పోస్టు చేస్తారు.