28న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రామప్ప సందర్శన
విధాత, వరంగల్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 28వ తేదీన ములుగు జిల్లాకు రానున్నారు. జిల్లాలోని వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలోఉన్న రామప్ప దేవాలయాన్ని సందర్శించనున్నారు. అద్భుత శిల్ప సంపదకు నెలవైన రామప్ప ఆలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ సంస్కృతి హోదా దక్కిన సంగతి తెలిసిందే. రామప్పను సందర్శించేందుకు విచ్చేయనున్న రాష్ట్రపతి ముర్ము రామప్ప అభివృద్ధి కోసం కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రసాద్ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు

విధాత, వరంగల్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 28వ తేదీన ములుగు జిల్లాకు రానున్నారు. జిల్లాలోని వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలోఉన్న రామప్ప దేవాలయాన్ని సందర్శించనున్నారు.
అద్భుత శిల్ప సంపదకు నెలవైన రామప్ప ఆలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ సంస్కృతి హోదా దక్కిన సంగతి తెలిసిందే. రామప్పను సందర్శించేందుకు విచ్చేయనున్న రాష్ట్రపతి ముర్ము రామప్ప అభివృద్ధి కోసం కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రసాద్ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు