నల్గొండ: గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం: MLA శేఖర్ రెడ్డి
విధాత, ఉమ్మడి నల్గొండ బ్యూరో: గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చి పని చేస్తుందని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం వలిగొండ గ్రామపంచాయతీ పరిధిలో కోటి రూపాయలకు పైగా చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో గ్రామాల్లో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉండేదని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రామాలన్నీ అభివృద్ధి […]

విధాత, ఉమ్మడి నల్గొండ బ్యూరో: గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చి పని చేస్తుందని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం వలిగొండ గ్రామపంచాయతీ పరిధిలో కోటి రూపాయలకు పైగా చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో గ్రామాల్లో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉండేదని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రామాలన్నీ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయాలకతీతంగా అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తుందన్నారు. అనంతరం రైతు వేదికను ప్రారంభించి మాట్లాడారు.
రైతులు రైతు వేదికలను సద్వినియోగం చేసుకొని వ్యవసాయ శాఖ వారి ద్వారా తగిన సూచనలు, సలహాలు తీసుకొని వ్యవసాయంలో అభివృద్ధి సాధించాలని కోరారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. అంతకుముందు భువనగిరి మండలం నవాత్ పల్లిలో రూ.70లక్షలతో పనులను ప్రారంభించారు.