బీహార్‌లో దుర్మార్గం: లైంగిక దాడికి శిక్ష ఐదు కొరడా దెబ్బలు..!
విధాత: ఆధునిక నాగరిక సమాజం తలదించుకొనే ఘటన ఇది. బీహార్ నవాడా ప్రాంతంలోని ఓ గ్రామంలో ఐదేండ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి అక్కడి గ్రామపంచాయతీ పెద్దలు ఐదు గుంజీల శిక్ష విధించి వదిలేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బీహార్‌లోని ఓ గ్రామంలో అరుణ్ పండిట్ అనే యువకుడు కోళ్లఫారంలో పనిచేస్తున్నాడు. స్థానికంగా నివసించే కుటుంబానికి చెందిన ఐదేండ్ల బాలికకు చాక్లెట్ ఇప్పిస్తానని మాయ మాటలు చెప్పి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న […]

విధాత: ఆధునిక నాగరిక సమాజం తలదించుకొనే ఘటన ఇది. బీహార్ నవాడా ప్రాంతంలోని ఓ గ్రామంలో ఐదేండ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి అక్కడి గ్రామపంచాయతీ పెద్దలు ఐదు గుంజీల శిక్ష విధించి వదిలేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
బీహార్‌లోని ఓ గ్రామంలో అరుణ్ పండిట్ అనే యువకుడు కోళ్లఫారంలో పనిచేస్తున్నాడు. స్థానికంగా నివసించే కుటుంబానికి చెందిన ఐదేండ్ల బాలికకు చాక్లెట్ ఇప్పిస్తానని మాయ మాటలు చెప్పి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయటానికి ప్రయత్నిస్తే.. కోళ్లఫారం యజమాని గ్రామపంచాయితీలో తేల్చుకోమని అడ్డగించాడు.
దీంతో బాధిత కుటుంబం గ్రామపెద్దలను ఆశ్రయించటంతో.. వారు నిందితునికి ఐదు కొరడా దెబ్బలు శిక్షగా విధించి వదిలేశారు. దీనిపై తీవ్ర అసంతృప్తి, అసహనంతో ఉన్న గ్రామస్థులు నిందితుడు పండిట్ కాకుండా ఓ దళితుడే అయితే శిక్ష ఇలాగే ఉండేదా అని ప్రశ్నిస్తున్నారు. మనుస్మృతి తలకెక్కించుకున్నసమాజంలో న్యాయం ఎలా ఉంటుందో ఇదే నిదర్శనమని వాపోతున్నారు.