దిగొచ్చిన పుతిన్‌.. ఉక్రెయిన్‌తో యుద్ధంపై చర్చలకు ప్రతిపాదన

యుద్ధాన్ని మెరుగ్గా ముగుస్తామంటున్న రష్యా నేత పుతిన్‌ విధాత: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం విషయంలో ఎట్టకేలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ దిగొచ్చారు. ఉక్రెయిన్‌ యుద్ధాన్ని వీలైనంత వేగంగా అర్థవంతంగా ముగిస్తామని ప్రకటించారు. మాస్కోలో విలేకర్లతో మాట్లాడుతూ… ‘ఈ సంక్షోభాన్ని ముగించటమే మా లక్ష్యం. దీన్ని వీలైనంత వేగంగా ముగించటానికి ప్రయత్నిస్తున్నాం. ఇందుకోసం మేం కష్టపడుతున్నాం. యుద్ధం ముగింపు దశకు వచ్చిందని నిర్ధారించుకోవటానికి యత్నిస్తున్నాం. ఏ యుద్ధమైనా చివరికి ఏదో రూపంలో చర్చలతోనే ముగుస్తుంది. దాని కోసం మేం […]

దిగొచ్చిన పుతిన్‌.. ఉక్రెయిన్‌తో యుద్ధంపై చర్చలకు ప్రతిపాదన
  • యుద్ధాన్ని మెరుగ్గా ముగుస్తామంటున్న రష్యా నేత పుతిన్‌

విధాత: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం విషయంలో ఎట్టకేలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ దిగొచ్చారు. ఉక్రెయిన్‌ యుద్ధాన్ని వీలైనంత వేగంగా అర్థవంతంగా ముగిస్తామని ప్రకటించారు. మాస్కోలో విలేకర్లతో మాట్లాడుతూ… ‘ఈ సంక్షోభాన్ని ముగించటమే మా లక్ష్యం. దీన్ని వీలైనంత వేగంగా ముగించటానికి ప్రయత్నిస్తున్నాం.

ఇందుకోసం మేం కష్టపడుతున్నాం. యుద్ధం ముగింపు దశకు వచ్చిందని నిర్ధారించుకోవటానికి యత్నిస్తున్నాం. ఏ యుద్ధమైనా చివరికి ఏదో రూపంలో చర్చలతోనే ముగుస్తుంది. దాని కోసం మేం ప్రయత్నిస్తున్నాం..’ అని ప్రకటించటం గమనార్హం.

నిజానికి గత కొంత కాలంగా… ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యా సేనలు తీవ్రంగా నష్టపోతున్నాయి. వేల సంఖ్యలో ఆర్మీ అధికారులు చ‌నిపోయారు. గతంలో ఆక్రమించుకొన్న నగరాలు ఒకటొకటిగా రష్యా కోల్పోతున్నది. తిరిగి అవన్నీ ఉక్రెయిన్‌ వశమవుతున్నాయి. మరో వైపు రష్యాలో కూడా ఉక్రెయిన్‌ యుద్ధంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. రష్యా సైనికులు ఉక్రెయిన్‌ యుద్ధభూమికి పోవటానికే నిరాకరిస్తున్న పరిస్థితి ఉన్నది.

ఒకటి రెండు రోజుల్లో ఉక్రెయిన్‌ను పాదా క్రాంతం చేసుకోవచ్చని భావించి యుద్ధం ప్రకటించిన రష్యా దీర్ఘకాలిక యుద్ధంలో కూరుకుపోయింది. అడుగడుగునా ఉక్రెయిన్‌ సేనలు తీవ్రంగా ప్రతిఘటిస్తూ ఎదురొడ్డి పోరాడుతున్నాయి. రోజుల్లో ముగుస్తుందనుకున్న యుద్ధం నెలలు గడుస్తున్నా కొలిక్కి రాకపోగా రష్యా వెనుకడుగు వేయాల్సిన పరిస్థితి ఎదురవుతున్నది. ఈ నేపథ్యంలోంచే.. పుతిన్‌ కిందపడ్డా తనదే పై చేయి అన్న చందంగా యుద్ధం ముగింపు మాటలు మాట్లాడుతున్నారని పరిశీలకులు అంటున్నారు.

ఇదిలా ఉంటే… మొదటిసారి విదేశీ ప్రయాణం చేస్తున్న జెలెన్‌స్కీ అమెరికా చేరుకున్నారు. ఆయనకు అమెరికాలో ఘన స్వాగతం లభించింది. ఉక్రెయిన్‌ నేత అమెరికాలో అడుగు పెట్టేందుకు కొన్ని రోజుల ముందే ఉక్రెయిన్‌కు 1.8 కోట్ల డాలర్ల విలువైన ఆయుధ సామాగ్రి అందించేందుకు అమెరికా అంగీకరించింది.

అలాగే.. క్షిపణి వ్యవస్థను నిర్వీర్యం చేసే పెట్రియాట్‌ వ్యవస్థను ఉక్రెయిన్‌కు సమకూర్చేందుకు అమెరికా ముందుకు వచ్చింది. దీంతో.. రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉన్నది. ఈ విధమైన పరిణామాలతో ఉక్రెయిన్‌ సేనలు మరింత శక్తివంతమై రష్యా దాడిని తిప్పికొట్టే అవకాశాలున్నాయి. ఈ పరిస్థితుల్లోనే పుతిన్‌ నోట చర్చల ప్రస్థావన తెస్తున్నట్లు తెలుస్తున్నది.