రావి జీవితం ఆదర్శనీయం: మంత్రి జగదీశ్ రెడ్డి
విధాత, నల్గొండ:నిజాం రాచరిక పాలన నుండి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించి ప్రజాస్వామిక పాలన సాధనకు కామ్రేడ్ రావి నారాయణ రెడ్డి సాగించిన కృషి చిరస్మరణీయంగా నిలిచి పోతుందని, రావి జీవితం అదర్శనీయమని మంత్రి జి.జగదీష్ రెడ్డి అన్నారు. శనివారం భువనగిరి మండలం బొల్లెపల్లి లో రావి నారాయణ రెడ్డి 31 వర్ధంతి సభలో ఆయన హాజరై రావికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రమహాసభ, కమ్యూనిస్టు పార్టీల సారధిగా ఆనాటి తెలంగాణ పీడిత […]

విధాత, నల్గొండ:నిజాం రాచరిక పాలన నుండి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించి ప్రజాస్వామిక పాలన సాధనకు కామ్రేడ్ రావి నారాయణ రెడ్డి సాగించిన కృషి చిరస్మరణీయంగా నిలిచి పోతుందని, రావి జీవితం అదర్శనీయమని మంత్రి జి.జగదీష్ రెడ్డి అన్నారు.
శనివారం భువనగిరి మండలం బొల్లెపల్లి లో రావి నారాయణ రెడ్డి 31 వర్ధంతి సభలో ఆయన హాజరై రావికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రమహాసభ, కమ్యూనిస్టు పార్టీల సారధిగా ఆనాటి తెలంగాణ పీడిత ప్రజల ప్రజాస్వామిక హక్కుల కోసం, భూమి కోసం, భుక్తి కోసం, రాచరిక పాలన విముక్తి కోసం సాగించిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చరిత్రలో నిలిచిందన్నారు.
తెలంగాణ భారత్ దేశంలో విలీనం తర్వాత వచ్చిన మొదటి సాధారణ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీచేసి నాటి ప్రధాని నెహ్రూ కంటే ఎక్కువ మెజార్టీతో గెలిచి ప్రజాభిమానంలో సాటి లేదని చాటు కోవడంతో పాటు పేదల సంక్షేమ కోసం పార్లమెంట్ చట్టాల రూప కల్పనకు చేసిన కృషి శ్లాఘనీయమన్నారు.
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి మాట్లాడుతూ కమ్యూనిస్టు పోరాటాలు ఉన్నంత వరకు రావి పేరు చిరస్మరణీయంగా కొనసాగుతుందన్నారు. తెలంగాణ విముక్తి పోరాటాలతో సంబంధం లేని పార్టీలు నేడు తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ రాజకీయం చేయడం పట్ల తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలన్నారు.
రావి స్పూర్తితో నేటి తరం యువత రాజకీయల్లో చైతన్య వంతమైన భూమిక కు ముందుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, మునుగోడు నియోజకవర్గ టీఆర్ఎస్ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.