Rahul disqualified : రాహుల్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే.. BJP అనర్హత వేటు: మాణిక్‌రావ్ ఠాక్రే
విధాత, ప్రతినిధి అదిలాబాద్: ప్రజల తరఫున రాహుల్ సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేని బిజెపి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కక్ష్య సాధింపులో భాగంగా రాహుల్ గాంధీని పార్లమెంటుకు రాకుండా చేసే కుట్రలో భాగమే అనర్హత వేటు అని ఏఐసీసీ సెక్రెటరీ తెలంగాణ ఇన్‌చార్జి మాణిక్రావు ఠాక్రే అన్నారు మంచిర్యాల జిల్లా నస్పూర్ లోని కలెక్టరేట్ కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేస్తున్న సత్యాగ్రహ బహిరంగ సభ ప్రాంగణాన్ని తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్ రావు ఠాక్రే పరిశీలించారు. […]

విధాత, ప్రతినిధి అదిలాబాద్: ప్రజల తరఫున రాహుల్ సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేని బిజెపి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కక్ష్య సాధింపులో భాగంగా రాహుల్ గాంధీని పార్లమెంటుకు రాకుండా చేసే కుట్రలో భాగమే అనర్హత వేటు అని ఏఐసీసీ సెక్రెటరీ తెలంగాణ ఇన్‌చార్జి మాణిక్రావు ఠాక్రే అన్నారు
మంచిర్యాల జిల్లా నస్పూర్ లోని కలెక్టరేట్ కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేస్తున్న సత్యాగ్రహ బహిరంగ సభ ప్రాంగణాన్ని తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్ రావు ఠాక్రే పరిశీలించారు. సభా ప్రాంగణం గురించి అక్కడున్న స్థానిక కాంగ్రెస్ నేతలతో మాట్లాడారు. ఏర్పాట్ల గురించి ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మాణిక్ రావు ఠాక్రే మాట్లాడుతూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపడుతున్న
పాదయాత్రకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తున్నదని, భట్టి పాదయాత్రలో భాగంగా శుక్రవారం మంచిర్యాలలో సత్యాగ్రహ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సభకు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ముఖ్యఅతిథిగా హాజరవుతారని పేర్కొన్నారు.
దేశంలో ప్రజాస్వామ్యం కాపాడాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నిర్వహించిన భారత్ జోడో యాత్రకు పెద్ద ఎత్తున ప్రజాదరణ లభించిందని అన్నారు. భారత్ జోడోలో రాహుల్ ఇచ్చిన సందేశాన్ని గడపగడపకు తీసుకెళ్లడానికి ఎఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా హాత్ సే హాథ్ జోడో కార్యక్రమం కొనసాగుతున్నదని తెలిపారు. దేశంలో ప్రజాస్వామ్యం పై బిజెపి దాడి చేస్తున్నదన్నారు.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ బిజెపి అనుసరిస్తున్న నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా, రాహుల్ గాంధీకి మద్దతుగా దేశవ్యాప్తంగా సత్యాగ్రహ సభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు వేరు వేరు కాదు. రెండు ఒకటే అని పార్లమెంట్లో బిజెపి తీసుకు వచ్చిన అనేక చట్టాలకు బిఆర్ఎస్ ఎంపీలు ఓటు వేసి మద్దతు తెలిపింది నిజం కాదా?అని ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పేద, దళిత, గిరిజనుల భూములను గుంజుకుని తిరిగి దొరలకు అప్పచెప్పుతున్నదని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టి 5 లక్షల కోట్ల అప్పుల భారం మోపిన బిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో నిధులన్నీ ఏం చేశారని ప్రశ్నించారు? కేసీఆర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీల అభివృద్ధికి నిధులు కేటాయించ లేదని అన్నారు. పేదల అభివృద్ధి, అభ్యున్నతి కాంగ్రెస్‌తోనే సాధ్యం అని తెలిపారు
తెలంగాణ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్న యాత్ర, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేస్తున్న పాదయాత్ర బిఆర్ఎస్ బిజెపి పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడానికి దోహదం చేస్తాయని అన్నారు.
మీడియా సమావేశంలో సిఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎఐసిసి కార్యదర్శి రోహిత్ చౌదరి, సంపత్ కుమార్, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ప్రచార కమిటీ కన్వీనర్ అజ్మతుల్లా, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు, పీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్, డిసిసి అధ్యక్షులు కే సురేఖ, పిసిసి నాయకులు సంజీవరెడ్డి తదితరులు ఉన్నారు.