Rahul Gandhi | న్యాయం గెలిచింది: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
Rahul Gandhi | విధాత: రాహుల్ గాంధీ పై బీజేపీ నేతలు వేసిన కేసులలో సుప్రీం కోర్ట్ స్టే ఇవ్వడం పట్ల పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. న్యాయం గెలిచింది.. బీజేపీ ప్రభుత్వ కుట్రలు చిత్తయ్యాయని వ్యాఖ్యానించారు. కుట్ర పూరితంగా రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేయడం, అధికారిక నివాసాన్ని ఖాళీ చేయించడం లాంటి చర్యలు దుర్మార్గమన్నారు. సుప్రీం కోర్ట్ తీర్పు పట్ల దేశంలో హర్షాతిరేకం వ్యక్తం అవుతోందన్నారు. న్యాయం గెలిచింది.. ప్రజల్లో […]

Rahul Gandhi |
విధాత: రాహుల్ గాంధీ పై బీజేపీ నేతలు వేసిన కేసులలో సుప్రీం కోర్ట్ స్టే ఇవ్వడం పట్ల పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. న్యాయం గెలిచింది.. బీజేపీ ప్రభుత్వ కుట్రలు చిత్తయ్యాయని వ్యాఖ్యానించారు.
కుట్ర పూరితంగా రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేయడం, అధికారిక నివాసాన్ని ఖాళీ చేయించడం లాంటి చర్యలు దుర్మార్గమన్నారు. సుప్రీం కోర్ట్ తీర్పు పట్ల దేశంలో హర్షాతిరేకం వ్యక్తం అవుతోందన్నారు. న్యాయం గెలిచింది.. ప్రజల్లో చట్టం, న్యాయం పట్ల మళ్ళీ విశ్వాసం పెరిగిందని అన్నారు.
బీజేపీ కుట్రలను ప్రజలు అర్థం చేసుకొని, రాహుల్ గాంధీకి అండగా నిలిచారన్నారు. పీసీసీ అధ్వర్యంలో గాంధీ భవన్ లో సంబురాలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గాంధీభవన్, సీఎల్పీ కార్యాలయాల్లో స్వీట్లు పంచుకున్నారు.