Rahul Gandhi: దురదృష్టవశాత్తూ MP అయ్యా.. నోరు జారిన రాహుల్‌గాంధీ.. BJP నేత‌ల ఫైర్

సోష‌ల్‌మీడియాలో రాహుల్ వ్యాఖ్య‌లు వైర‌ల్‌.. విధాత‌: యూకే (UK) పర్యటనలో రాహుల్‌గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలు పార్లమెంటు (Parliament)లో దుమారం రేపుతున్న సమయంలోనే మరో ప్రసంగంతో ఆయన చిక్కుల్లో పడ్డారు. విలేకర్లతో మాట్లాడుతూ.. ఆయన ఒక వాక్యాన్ని తప్పుగా ఉచ్చరించారు. దీంతో కేంద్రమంత్రులు, బీజేపీ (BJP) ఎంపీ (MP)లు రాహుల్‌ (Rahul)పై ధ్వజమెత్తుతున్నారు. తాను దురదృష్టవశాత్తూ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నానంటూ.. రాహుల్‌ మాట్లాడిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అక్కడే ఉన్న జైరాం రమేష్‌ […]

  • Publish Date - March 17, 2023 / 12:12 PM IST

సోష‌ల్‌మీడియాలో రాహుల్ వ్యాఖ్య‌లు వైర‌ల్‌..

విధాత‌: యూకే (UK) పర్యటనలో రాహుల్‌గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలు పార్లమెంటు (Parliament)లో దుమారం రేపుతున్న సమయంలోనే మరో ప్రసంగంతో ఆయన చిక్కుల్లో పడ్డారు. విలేకర్లతో మాట్లాడుతూ.. ఆయన ఒక వాక్యాన్ని తప్పుగా ఉచ్చరించారు. దీంతో కేంద్రమంత్రులు, బీజేపీ (BJP) ఎంపీ (MP)లు రాహుల్‌ (Rahul)పై ధ్వజమెత్తుతున్నారు.

తాను దురదృష్టవశాత్తూ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నానంటూ.. రాహుల్‌ మాట్లాడిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అక్కడే ఉన్న జైరాం రమేష్‌ వెంటనే రాహుల్‌ను అప్రమత్తం చేశారు. బీజేపీ దురదృష్టం కొద్దీ తాను ఎంపీగా ఉన్నానంటూ సర్దిచెప్పారు.

మీడియాతో రాహుల్‌ మాట్లాడుతూ.. అదానీ (Adani) ఎవరు? షెల్‌ (SHell) కంపెనీలు ఉన్న ఆ వ్యక్తితో మోడీకి ఉన్న సంబంధం ఏమిటి? దురదృష్టశాత్తూ నేను ఎంపీగా ఉన్నాను. నేను పార్లమెంటులో మాట్లాడే అవకాశం వస్తుందని ఆశిస్తున్నాను.

దీనిపై విలేకర్లు రాహుల్‌ను ప్రశ్నిస్తుండగా.. జైరాం రమేష్‌ మీ దురదృష్టం కొద్దీ అని చెప్పండని రాహుల్‌కు చెప్పారు. అనంతరం ఆ వాక్యంపై స్పష్టత ఇవ్వదలుచుకున్నాను. మీ దురదృష్టం కొద్దీ నేను పార్లమెంటు సభ్యుడిగా ఉన్నానని సర్దిచెప్పారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో చెక్కర్లు కొడుతుండటంతో బీజేపీ నేతలు రాహుల్‌పై ఫైర్‌ అవుతున్నారు.