Telangana | ఇవాళ, రేపు అతి భారీ వర్షాలు.. ఆ 8 జిల్లాలకు హెచ్చరిక
Telangana | రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శని, ఆదివారాల్లో ఉత్తర తెలంగాణలోని 8 జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. శనివారం ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో 115.6 నుంచి 204.4 మి.మీ. వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. మరో ఏడు జిల్లాల్లో 64.5 నుంచ115.5 […]

Telangana | రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శని, ఆదివారాల్లో ఉత్తర తెలంగాణలోని 8 జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది.
శనివారం ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో 115.6 నుంచి 204.4 మి.మీ. వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. మరో ఏడు జిల్లాల్లో 64.5 నుంచ115.5 మి.మీ. వర్షం కురిసే అవకాశం ఉంది. దీంతో ఈ జిల్లాల్లో విపత్తు దళాలు అప్రమత్తం కావాలని వాతావరణ శాఖ సూచించింది.
కాగా నైరుతి రుతుపవనాలు శుక్రవారం నాటికి నిజామాబాద్ జిల్లాలో కొంత భాగం వరకు విస్తరించాయి. కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్ జిల్లాలతో పాటు నిజామాబాద్ జిల్లాలో కొంత భాగం వ్యాపించాల్సి ఉంది. ఆదివారం నాటికి రాష్ట్రమంతటా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
ఆదివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు వివిధ జిల్లాల్లో వర్షాలు కురిశాయి. మంచిర్యాల జిల్లా చెన్నూరులో అత్యధికంగా 8 సెం.మీ. వర్షపాతం నమోదైంది.