జనంపైకి రూ.500 నోట్ల వర్షం..! ఎందుకో తెలిస్తే షాకవుతారు..!

Viral Video | సాధారణంగా ఎన్నికల సమయంలో రాజకీ నేతలు ప్రజలపై కాసుల వర్షం కురిపిస్తుండం మనం చూశాం.. బార్లలోనూ డ్యాన్స్‌ చేసే అమ్మాయిలపై నోట్లు వెదజల్లడం చూసే ఉంటారు.. కానీ, గుజరాత్‌లో ఓ వ్యక్తి తన ఇంటి డాబాపై నుంచి జనంపైకి నోట్ల వర్షం కురిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని మోహసానా జిల్లా కక్రీ తాలూకాలోని అగోల్‌ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. గ్రామానికి […]

జనంపైకి రూ.500 నోట్ల వర్షం..! ఎందుకో తెలిస్తే షాకవుతారు..!

Viral Video | సాధారణంగా ఎన్నికల సమయంలో రాజకీ నేతలు ప్రజలపై కాసుల వర్షం కురిపిస్తుండం మనం చూశాం.. బార్లలోనూ డ్యాన్స్‌ చేసే అమ్మాయిలపై నోట్లు వెదజల్లడం చూసే ఉంటారు.. కానీ, గుజరాత్‌లో ఓ వ్యక్తి తన ఇంటి డాబాపై నుంచి జనంపైకి నోట్ల వర్షం కురిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని మోహసానా జిల్లా కక్రీ తాలూకాలోని అగోల్‌ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ కరీంబాయి దాదుబాయి జాదవ్‌ మేనల్లుడు రజాక్‌ వివాహం జరిగింది. కుటుంబంలో రజాక్‌ ఒక్కడే మగ సంతానం కావడంతో ఘ‌నంగా పెళ్లి చేశారు.

పెళ్లి ఊరేగింపు సందర్భంగా ఆనందంలో కుటుంబీకులు ఇంటి దాబాపై నుంచి రూ.500 నోట్ల వర్షం కురిపించారు. దాదాపు రూ.50లక్షల వరకు కాసుల వర్షం కురిపించినట్లు సమాచారం. ఈ నోట్లను ఏరుకునేందుకు స్థానికులు పోటీపడ్డారు.

గాల్లో ఎగురుతూ వస్తున్న నోట్లను పట్టుకునేందుకు జనం పోటీపడగా.. తోపులాట జరిగింది. నోట్లు వెదజల్లుతున్న వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఆ వీడియోను మీరూ ఓసారి చూసేయండి మరి..