Rajasthan | రెండు గుండెలు, నాలుగు కాళ్లు, చేతులో వింత శిశువు జననం.. 20 నిమిషాలకే మృతి
Rajasthan | విధాత: రాజస్థాన్‌లో వింత శిశువు జన్మించింది. రెండు గుండెలు( Hearts ), నాలుగు కాళ్లు, చేతులతో జన్మించిన ఆ శిశువు.. పుట్టిన 20 నిమిషాలకే ప్రాణాలు విడిచింది. తల్లి ఆరోగ్యంగా ఉంది. ఈ ఘటన రాజస్థాన్ చురు జిల్లా( Churu Dist )లోని గంగారాం ఆస్పత్రిలో ఆదివారం రాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. చురు జిల్లాలోని రాజల్‌దేశార్‌కు చెందిన మమత కన్వార్(19) అనే వివాహితకు నెలలు నిండాయి. ఆదివారం […]

Rajasthan |
విధాత: రాజస్థాన్‌లో వింత శిశువు జన్మించింది. రెండు గుండెలు( Hearts ), నాలుగు కాళ్లు, చేతులతో జన్మించిన ఆ శిశువు.. పుట్టిన 20 నిమిషాలకే ప్రాణాలు విడిచింది. తల్లి ఆరోగ్యంగా ఉంది. ఈ ఘటన రాజస్థాన్ చురు జిల్లా( Churu Dist )లోని గంగారాం ఆస్పత్రిలో ఆదివారం రాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. చురు జిల్లాలోని రాజల్‌దేశార్‌కు చెందిన మమత కన్వార్(19) అనే వివాహితకు నెలలు నిండాయి. ఆదివారం రాత్రి పురిటినొప్పులు రావడంతో ఆమెను కుటుంబ సభ్యులు గంగారాం ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెకు వైద్యులు సోనోగ్రఫీ (Sonography) పరీక్షలు నిర్వహించారు. కడుపులో ఉన్న శిశువుకు ఒక తల, రెండు గుండెలు, నాలుగు చేతులు, కాళ్లు, రెండు వెన్నెముకలు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు.
రాత్రి 9 గంటలకు సాధారణ డెలివరీ..
మమత అదే రోజు రాత్రి 9 గంటలకు నార్మల్ డెలివరీ అయింది. పుట్టిన మగ శిశువును చూసి కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. ఒక తల, రెండు గుండెలు, నాలుగు చేతులు, కాళ్లు, రెండు వెన్నెముకలతో ఉన్న శిశువును చూసి వైద్యులు కూడా ఆశ్చర్యపోయారు. అయితే ఆ శిశువు జన్మించిన 20 నిమిషాలకే మృతి చెందాడు. తల్లి మమత ఆరోగ్యంగా ఉంది.
క్రోమోజోమ్‌ల అసమతుల్యత వల్లే..
ఈ సందర్భంగా డాక్టర్ రీటా సోంగరా మాట్లాడుతూ.. మమత తమ ఆస్పత్రికి వచ్చే కొద్ది రోజుల కంటే ముందు.. వేరే ఆస్పత్రిలో సోనోగ్రఫీ టెస్టు చేయించుకుంది. కడుపులో ఉన్న బిడ్డ నార్మల్‌గానే ఉందని చెప్పారట. కానీ తామిక్కడ సోనోగ్రఫీ నిర్వహిస్తే, శిశువుకు రెండు గుండెలు, నాలుగు కాళ్లు, చేతులు, రెండు వెన్నెముకలు ఉన్నట్లు తేలింది.
హార్ట్ బీట్ కూడా చాలా తక్కువగా ఉండే అని డాక్టర్ తెలిపారు. నార్మల్ డెలివరీ కావడం వల్ల తల్లికి ప్రాణపాయం తప్పిందన్నారు. ఇలాంటి డెలివరీని ‘కంజుక్టివల్ అనోమలీ’ (conjunctival anomaly) అంటారని తెలిపారు. క్రోమోజోముల( Chromosomes ) అసమతుల్యత కారణంగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయని డాక్టర్ స్పష్టం చేశారు.