ఎక్కువ మంది పిల్లల్ని కనండి.. మోడీ ఇండ్లు కట్టిస్తాడు
ఎక్కువ మంది పిల్లల్ని కనండి.. ప్రధాని మోడీ మీకు ఇళ్లు కట్టిస్తాడని రాజస్థాన్ మంత్రి బాబులాల్ ఖరాడీ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

- రాజస్థాన్ మంత్రి బాబులాల్ ఖరాడీ
విధాత : ఎక్కువ మంది పిల్లల్ని కనండి.. ప్రధాని మోడీ మీకు ఇళ్లు కట్టిస్తాడని రాజస్థాన్ మంత్రి బాబులాల్ ఖరాడీ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. రాజస్థాన్‌లో ఓ సభలో మీరు ఎక్కువ మంది పిల్లల్ని కనండి.. మీరు ఎంతమందిని కన్నా అందరికీ మోదీ ఇళ్లు కట్టిస్తాడని చెప్పారు. అందరికీ ఇల్లు ఉండాలనేదే మోదీ కల అని, మీరు పిల్లల్ని కనడంలో సమస్య ఏంటి అని మంత్రి బాబులాల్ ఖరాడీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి.
కాగా.. ఆయన ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేశాడోగాని పిల్లలు కనడానికి..ఇళ్ల నిర్మాణానికి ముడిపెట్టిన తీరు మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టినట్లుగా ఉందంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఎన్నికల ముంగిట పార్టీకి మంచి వాతావరణం ఉందని, పార్టీలోని అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు వివాదస్పద..అనుచిత వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని, ప్రజలతో సన్నిహితంగా ఉండాలని ప్రధాని మోడీ పార్టీ శ్రేణులకు తాజాగా నిర్ధేశం చేశారు. అయినప్పటికి బాబులాల్ ఖరాడీ అలాంటి వ్యాఖ్యలే చేయడంతో ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.