క‌ర్నిసేన చీఫ్ సుఖ్‌దేవ్ సింగ్ హ‌త్య కేసులో మ‌హిళ అరెస్ట్

క‌ర్నిసేన చీఫ్ సుఖ్‌దేవ్ సింగ్ హ‌త్య కేసులో ఇద్ద‌రు షూట‌ర్ల‌తో పాటు వారికి స‌హ‌క‌రించిన మ‌హిళని రాజ‌స్థాన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

క‌ర్నిసేన చీఫ్ సుఖ్‌దేవ్ సింగ్ హ‌త్య కేసులో మ‌హిళ అరెస్ట్

జైపూర్ : రాష్ట్రీయ‌ రాజ్‌పుత్ క‌ర్నిసేన చీఫ్ సుఖ్‌దేవ్ సింగ్ హ‌త్య కేసు ద‌ర్యాప్తు కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే ఇద్ద‌రు షూట‌ర్ల‌తో పాటు వారికి స‌హ‌క‌రించిన ఓ వ్య‌క్తిని రాజ‌స్థాన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా జైపూర్‌కు చెందిన పూజా షైనీ అనే మ‌హిళ‌ను అరెస్టు చేశారు పోలీసులు.


అయితే పూజా షైనీ, ఆమె భ‌ర్త మ‌హేంద్ర మేఘ్వాల్ క‌లిసి షూట‌ర్ల‌లో ఒక‌రైన నితిన్ ఫౌజీకి ఆయుధాలు స‌మ‌కూర్చిన‌ట్లు పోలీసుల ద‌ర్యాప్తులో తేలింది. జైపూర్‌లో వారు ఉంటున్న అద్దె ఇంట్లోనే నితిన్‌కు వారం రోజుల పాటు ఆశ్ర‌యం ఇచ్చిన‌ట్లు పోలీసులు తెలిపారు. ఆ త‌ర్వాత డిసెంబ‌ర్ 5వ తేదీన సుఖ్‌దేవ్‌ను నితిన్, రోహిత్ రాథోడ్ క‌లిసి హ‌త్య చేశారు.


పూజా షైనీ భ‌ర్త మ‌హేంద్ర మేఘ్వాల్‌కు నేర చ‌రిత్ర ఉంది. అత‌ని స‌మీర్ అని కూడా పిలుస్తార‌ని పోలీసులు తెలిపారు. ప్ర‌స్తుతం అత‌ను ప‌రారీలో ఉన్నాడ‌ని, ప‌ట్టుకునేందుకు చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయ‌ని చెప్పారు.