అయ్యప్ప దీక్ష.. ముగించిన హీరో రామ్‌చరణ్‌

  • By: Somu    latest    Oct 04, 2023 10:49 AM IST
అయ్యప్ప దీక్ష.. ముగించిన హీరో రామ్‌చరణ్‌

విధాత: మెగా పవర్ స్టార్ రామచరణ్‌ ముంబై శ్రీఇ సిద్ధి వినాయక ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో పూజా కార్యక్రమంతో అయ్యప్ప మాల దీక్షను ముగించారు. హీరో రామచరణ్‌ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ప్రతి ఏటా రామ్‌చరణ అయ్యప్ప దీక్షను తీసుకుంటారు.


సినిమాల్లో ఎంత బిజీగా ఉన్న తన అధ్యాత్మిక, ఆచార వ్యవహారాలను కూడా విధిగా పాటించడం ద్వారా రామచరణ్ అభిమానుల్లో ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఈ ఏడాది రామ్‌చరణ్ జీవితంలో కుమార్తె క్లీంకార జననం మరింత విశిష్టతను కల్గించింది. రామ్‌చరణ్‌ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమా షూటింగ్‌లో మళ్లీ బిజీ కానున్నారు.