రామ్ చరణ్ కూడా కొత్త పార్టీ.. పేరేంటో తెలుసా?

విధాత: చిరంజీవి ప్రజారాజ్యం, పవన్ కల్యాణ్ జనసేన.. ఇప్పుడు రామ్ చరణ్ కొత్త పార్టీ పెట్టబోతున్నాడని అనుకుంటున్నారా? నిజమే ఆయన కొత్త పార్టీ పెడుతున్నారు.. కానీ అది రియల్‌గా కాదు.. రీల్‌లో. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ చిత్రం తరువాత చరణ్ నటిస్తున్న మరో భారీ చిత్రం ఆర్‌సి 15. ఈ చిత్రానికి డేరింగ్ అండ్ డైనమిక్ ఏస్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా, దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం పాన్ ఇండియా చిత్రంగా […]

  • By: krs    latest    Dec 25, 2022 7:31 AM IST
రామ్ చరణ్ కూడా కొత్త పార్టీ.. పేరేంటో తెలుసా?

విధాత: చిరంజీవి ప్రజారాజ్యం, పవన్ కల్యాణ్ జనసేన.. ఇప్పుడు రామ్ చరణ్ కొత్త పార్టీ పెట్టబోతున్నాడని అనుకుంటున్నారా? నిజమే ఆయన కొత్త పార్టీ పెడుతున్నారు.. కానీ అది రియల్‌గా కాదు.. రీల్‌లో. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ చిత్రం తరువాత చరణ్ నటిస్తున్న మరో భారీ చిత్రం ఆర్‌సి 15. ఈ చిత్రానికి డేరింగ్ అండ్ డైనమిక్ ఏస్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా, దిల్ రాజు నిర్మిస్తున్నాడు.

ఈ చిత్రం పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతోంది. దాంతో ఈ మూవీకి 400 కోట్లకు పైగా బడ్జెట్‌ను దిల్‌రాజు కేటాయించాడు. ఇందులో చ‌ర‌ణ్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నాడు. ఓ పాత్ర 90వ దశకంలోని పాత్ర కాగా మరో పాత్ర నేటి తరానికి సంబంధించింది. 90వ ద‌శ‌కంలో ఉండే పాత్రలో సీనియర్ రామ్ చరణ్ ముఖ్యమంత్రి పాత్రను పోషిస్తున్నాడని సమాచారం. అందుకోసం ఆయన కొత్త పార్టీని పెట్టి.. ప్రచారం చేసే సీన్లను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. మరో రామ్ చరణ్ పాత్ర ఎలక్షన్ కమిషనర్‌గా కనిపించనుందని తెలుస్తుంది.

ఇక ఫ్లాష్ బ్యాక్‌కి సంబంధించిన పెద్ద చరణ్‌కి సంబంధించిన సన్నివేశాలను ప్రస్తుతం రాజమండ్రి తీరంలోని గోదావరి ఇసుక తిన్నెలపై వేసిన భారీ సెట్‌లో చిత్రీకరిస్తున్నారు. ఇసుక తిన్నెలపై పెద్ద సెట్ వేశారు. చుట్టూ కర్రలతో ఫెన్సింగ్ ఏర్పాటు చేయడమే కాకుండా దాని చుట్టూ చరణ్‌కి సంబంధించిన భారీ కటౌట్లను కూడా ఏర్పాటు చేశారు. ఇది ఓ భారీ మీటింగ్‌కి సంబంధించిన సీన్. ఇందులో రామ్ చరణ్, శ్రీకాంత్‌తో పాటు పలువులు కీలక నటీనటులు పాల్గొంటున్నారు.

ఈ లోకేషన్‌కి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. దాంతో విషయం తెలుసుకున్న అభిమానులు భారీ సంఖ్యలో చేరుకొని చరణ్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇంతకీ రామ్ చరణ్ పార్టీ పేరేంటో తెలుసా..? అభ్యుదయ పార్టీ. దాని గుర్తు ట్రాక్టర్. దాంతో ఆయన పార్టీ గుర్తు ట్రాక్టర్‌కి ఓటు వేయాలని జనాలను రిక్వెస్ట్ చేసే సన్నివేశాలను శంకర్ చిత్రీకరిస్తున్నారు.

డిసెంబర్ 25 వరకు ఈ షెడ్యూల్ సాగనుంది. ఈ మూవీ అప్డేట్స్ కొత్త ఏడాదిలో అఫీషియల్‌గా ఉంటాయని తెలుస్తుంది. ఇక ఈ మూవీని వచ్చే ఏడాది వేసవి కానుకగా పాన్ ఇండియాగా విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కొడుకు రామ్ చరణ్ పాత్ర‌కు కియారా అద్వానీ జోడిగా నటిస్తుండగా, తండ్రి రామ్ చరణ్ పాత్రకు అంజలి జోడిగా నటిస్తోంది. శ్రీకాంత్, సునీల్ వంటి తారలు కీలక పాత్ర పోషిస్తున్న ఈ మూవీలో కోలీవుడ్ ద‌ర్శ‌కుడు, నటుడు ఎస్ జె సూర్య విలన్ పాత్రలో కనిపించనున్నాడు.