Ram Pothineni | టాలీవుడ్లో పెళ్లిళ్ల సీజన్..! త్వరలో పెళ్లి పీటలెక్కనున్న రామ్ పోతినేని..! బాబాయ్ రవికిశోర్ ఏమన్నారంటే..?
Ram Pothineni | టాలీవుడ్ యంగ్ హీరోలు ఇటీవల పెళ్లిపీటలెక్కుతున్నారు. ఇప్పటికే శర్వానంద్ రక్షితరెడ్డిని రాజస్థాన్‌లో ఘనంగా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సైతం హీరోయిన్ లావణ్య త్రిపాఠిని త్వరలో పెళ్లి చేసుకోనున్నాడు. వీరిద్దరి ఎంగేజ్మెంట్ ఈ నెల 9న ఘనంగా జరిగింది. తాజాగా టాలీవుడ్ ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని సైతం పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తున్నది. 2006లో దేవదాసు చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశాడు రామ్. ఆ తర్వాత వరుస […]

Ram Pothineni | టాలీవుడ్ యంగ్ హీరోలు ఇటీవల పెళ్లిపీటలెక్కుతున్నారు. ఇప్పటికే శర్వానంద్ రక్షితరెడ్డిని రాజస్థాన్‌లో ఘనంగా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సైతం హీరోయిన్ లావణ్య త్రిపాఠిని త్వరలో పెళ్లి చేసుకోనున్నాడు.
వీరిద్దరి ఎంగేజ్మెంట్ ఈ నెల 9న ఘనంగా జరిగింది. తాజాగా టాలీవుడ్ ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని సైతం పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తున్నది. 2006లో దేవదాసు చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశాడు రామ్.
ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ యూత్‌లో మంచి క్రేజ్ సాధించాడు. అయితే, రామ్ పెళ్లిపై గతంలోనే పలుసార్లు వార్తలు వచ్చినా ఏవీ నిజం కాలేదు. తాజాగా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాలీవుడ్లో ప్రచారం జరుగుతున్నది. హైదరాబాద్‌కు చెందిన టాప్ బిజినెస్ మెన్ కూతురితో రామ్ వివాహం జరుగనున్నది టాక్.
ప్రస్తుతం బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో RAPO20 చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యాక పెళ్లి చేసుకోనున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఓ వైపు పెళ్లి పనుల్లోనే బిజీబిజీగా ఉంటూనే.. ఇప్పటికే సైన్ చేసిన సినిమాలను సైతం కంప్లీట్ చేయనున్నాడని టాక్ నడుస్తున్నది. బోయపాటి సినిమా తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో డబుల్ ఇస్మార్ట్ చిత్రంలో నటించనున్నాడు.
ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 8న శివరాత్రికి ప్రేక్షకుల ముందుకురాననున్నది. ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ఇప్పటికే డబుల్ ఇస్మార్ట్ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచింది. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లోనే ఒకేసారి విడుదలచేయనున్నారు.
ఇదిలా ఉండగా.. రామ్ బాబాయ్, ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిశోర్ స్పందించారు. పెళ్లి వార్తల్లో నిజం లేదన్నారు. ఒక వేళ రామ్‌కి వివాహం నిశ్చయమైతే ఆ విషయాన్ని దాచాల్సిన అవసరం లేదని, అందరికీ తెలుపుతామన్నారు.