నాడు తప్పు.. నేడు ఒప్పైంది: రామసేతు ఉనికిలేదు.. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్
రామసేతు లాంటి నిర్మాణం ఉన్నదని చెప్పటానికి శాస్త్రీయ ఆధారాలేవీ లేవు భారత్- శ్రీలంక మధ్య మానవ నిర్మితం లాంటి నిర్మాణం ఏదీ లేదు విధాత: రామసేతుకు సంబంధించి కచ్చితమైన ఆధారాలను భారతీయ ఖగోళ ఉపగ్రహాలు గుర్తించలేదని, కాబట్టి అది ఉన్నదని ఖచ్చితమైన ఆధారాలు లేకుండా రామసేతు లాంటి నిర్మాణం ఉన్నదని చెప్పలేమని కేంద్ర భూగోళ శాస్త్రాల మంత్రి గజేంద్ర సింగ్ ప్రకటించారు. పార్లమెంటులో రామసేతుకు గురించి అడిగిన ఒక ప్రశ్నకు బదులిస్తూ.. శాస్త్రీయమైన ఆధారాలు లేకుండా రామసేతు […]

- రామసేతు లాంటి నిర్మాణం ఉన్నదని చెప్పటానికి శాస్త్రీయ ఆధారాలేవీ లేవు
- భారత్- శ్రీలంక మధ్య మానవ నిర్మితం లాంటి నిర్మాణం ఏదీ లేదు
విధాత: రామసేతుకు సంబంధించి కచ్చితమైన ఆధారాలను భారతీయ ఖగోళ ఉపగ్రహాలు గుర్తించలేదని, కాబట్టి అది ఉన్నదని ఖచ్చితమైన ఆధారాలు లేకుండా రామసేతు లాంటి నిర్మాణం ఉన్నదని చెప్పలేమని కేంద్ర భూగోళ శాస్త్రాల మంత్రి గజేంద్ర సింగ్ ప్రకటించారు. పార్లమెంటులో రామసేతుకు గురించి అడిగిన ఒక ప్రశ్నకు బదులిస్తూ.. శాస్త్రీయమైన ఆధారాలు లేకుండా రామసేతు మానవ నిర్మితమని చెప్పలేమని తెలియజేయటం గమనార్హం.
గతంలో ఈ విషయంలోనే మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే విషయాన్ని చెప్పింది. అలా చెప్పటాన్ని తప్పుపడుతూ.. కాంగ్రెస్ హిందూ వ్యతిరేక పార్టీగా బీజేపీ పెద్ద ఎత్తున దాడి చేసింది. భారతీయ సంస్కృతి, చరిత్రపై గౌరవం లేని కాంగ్రెస్ రామసేతు ఉనికిపైనే తప్పుడు ప్రచారం చేస్తున్నదని ఆరోపించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేసింది.
కానీ, ఇప్పుడు అదే బీజేపీ ప్రభుత్వం.. రామ సేతు లాంటి నిర్మాణం గురించి కచ్చితమైన ఆధారం లేకుండా చెప్పటం కష్టం. చారిత్రకంగా చూస్తే.. అది 18వేల ఏండ్ల క్రితం నాటిది. భౌగోళికంగా చూస్తే దాని పొడవు 56 కిలీమీటర్లుగా తెలుస్తున్నది. అంతరిక్ష ఉపగ్రహ సాంకేతికత ద్వారా చూస్తే అక్కడ సున్నపు రాళ్లతో కూడిన ద్వీపాలున్నట్లు అర్థమవుతున్నది. వాటిని మానవ నిర్మితాలుగా చెప్పలేం. దీంతో భారత్-శ్రీలంక మధ్య రామసేతు అనే మానవ నిర్మితం ఉన్నట్లు చెప్పటానికి ఆధారాలేవీ లేవని ప్రకటించింది.
నిజానికి ఈ వివాదం.. సీతా సముద్రం ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగా తలెత్తింది. ప్రభుత్వం గల్ఫ్ ఆఫ్ మన్నార్‌ను లోతుగా తవ్వి నౌకల రాకపోకలకు మరింత అనువుగా చేయాలని తవ్వకాలు చేపట్టాలని నాటి యూపీఏ భావించింది. దీనికోసం 2005లో యూపీఏ-1 ప్రభుత్వం 12 మీటర్ల లోతు, 300 మీటర్ల వెడల్పుతో తవ్వకాలు చేపట్టాలనుకున్నది. ఇలా చేయటం ద్వారా రవాణా భారం తగ్గుతుందని కాంగ్రెస్ తెలిపింది. రవానా నౌకలకు శ్రీలంక చుట్టూ తిరిగే శ్రమ తగ్గటంతో పాటు 36 గంటల సమయం, ఇంధనం ఆదా అవుతుందని తెలియజేసింది.
గల్ఫ్ ఆఫ్ మన్నార్‌తో ఏ ప్రయోజనాలున్నా.. దాన్ని చేపట్టడానికి వీలు లేదని బీజేపీ వాదించింది.
భారత్ -శ్రీలంక మధ్య వానరుల సాయంతో శ్రీరాముడు రామసేతును నిర్మించాడని, అలాంటి పవిత్ర వారధిని యూపీఏ ప్రభుత్వం నాశనం చేస్తున్నదని బీజేపీ వివాదాస్పదం చేసింది.
రాజకీయ ప్రయోజనం కోసం దేన్నైనా వివాదాస్పదం చేసే ఆర్ ఎస్సెస్ హిందుత్వ శక్తులు రామ సేతుపై ఇప్పుడేమంటారో చూడాలి. ఇప్పటికైనా హిందుత్వ వాదులు తమ అభిప్రాయాలను మార్చుకొని శాస్త్రీయ అధ్యయనాలను గౌరవించాలి.