Vyuham | సీఎం జగన్ బయోపిక్.. ఏపీనీ హీటెక్కించేలా `వ్యూహం`! టీజర్ విడుదల
Vyuham | విధాత: వైయస్ జగన్ మోహన్ రెడ్డి బయో పిక్చర్ గా రూపొందుతున్న వ్యూహం సినిమాకు సంబంధించి కాసేపటి క్రితం టీజర్ రిలీజ్ ఐంది. దాసరి కిరణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఎన్నికల సమయానికి విడుదల చేయనున్నారు. గతంలో 2019 ఎన్నికల సమయంలో వైఎస్సార్ పాదయాత్ర నేపథ్యంలో రూపొందిన యాత్ర చిత్రం మంచి హిట్ టాక్ అందుకుని వైయస్ జగన్ కు కాస్త పాజిటివ్ గా ఉపయోగపడింది. ఇక ఇప్పుడు వ్యూహం పేరిట వస్తున్న […]

Vyuham |
విధాత: వైయస్ జగన్ మోహన్ రెడ్డి బయో పిక్చర్ గా రూపొందుతున్న వ్యూహం సినిమాకు సంబంధించి కాసేపటి క్రితం టీజర్ రిలీజ్ ఐంది. దాసరి కిరణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఎన్నికల సమయానికి విడుదల చేయనున్నారు.
గతంలో 2019 ఎన్నికల సమయంలో వైఎస్సార్ పాదయాత్ర నేపథ్యంలో రూపొందిన యాత్ర చిత్రం మంచి హిట్ టాక్ అందుకుని వైయస్ జగన్ కు కాస్త పాజిటివ్ గా ఉపయోగపడింది. ఇక ఇప్పుడు వ్యూహం పేరిట వస్తున్న చిత్రం కంప్లీట్ గా జగన్ బయో పిక్చర్ గా రూపొందుతోంది.
ఇది ఇప్పుడు జగన్ రాజకీయ ప్రయాణం.. ఎన్ని ఇబ్బందులు.. ఎన్ని మలుపులు.. ఇక్కట్లతో సాగింది .. కాంగ్రెస్ పార్టీ ఆయన్ను ఎలా ఇబ్బంది పెట్టింది.. ఇంకా ఓదార్పు యాత్ర వంటి పలు అంశాలు ఇందులో పొందుపరుస్తూ రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో జగన్ పాత్ర దారిగా అజ్మల్ , ఆయన భార్య భారతి పాత్రధారిగా మానస నటిస్తున్నారు.
ఇప్పటికే చానెళ్లు, యూట్యూబ్, ఇంకా సోషాల్ మీడియాలో టీజర్ విస్తృతంగా సర్క్యులేట్ అవుతోంది. వైఎస్సార్ హెలికాఫ్టర్ ప్రమాదం జరగడంతో టీజర్ స్టార్ట్ అవుతుంది. చిత్రం పట్ల అంచనాలు రెట్టింపు అయ్యేలా టీజర్ ఉంది. 2. 46 నిముషాల నిడివిగల ఈ ఒక డైలాగ్ చివర్లో ఉంది. అలా ఆలోచించడానికి చంద్రబాబును కాదు అనే జగన్ డైలాగ్ తో టీజర్ ముగుస్తోంది. ప్రస్తుతం ఆ టీజర్ బాగా వైరల్ ఆవుతోంది.