White Snake | తెలుపు రంగు పామును ఎప్పుడైనా చూశారా..? చూస్తే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే..!

White Snake | వ‌ర్షాలు ప‌డ్డాయంటే చాలు.. పాములు ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంటాయి. పొలాల్లో, జ‌వాసాల్లో పాములు క‌నిపిస్తూనే ఉంటాయి. అలా జ‌న‌వాసాల్లోకి వ‌చ్చే పాములు చాలా వ‌ర‌కు న‌లుపు లేదా బూడిద రంగులో ఉంటాయి. వాటిని చూసే స‌రికి గుండెల్లో రైళ్లు ప‌రుగెడుతాయి. కానీ ఈ పామును చూస్తే మాత్రం చూడాల‌నిపిస్తూనే ఉంటుంది. ఎలాంటి భ‌యం అనిపించ‌దు. ఎందుకంటే ఆ పాము చూడ‌టానికి తెలుపు రంగులో ఉంది. ఆరేడు అడుగుల పొడ‌వున్న ఆ తెలుపు రంగు పాము చూప‌రుల‌ను […]

  • Publish Date - August 1, 2023 / 05:17 AM IST

White Snake | వ‌ర్షాలు ప‌డ్డాయంటే చాలు.. పాములు ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంటాయి. పొలాల్లో, జ‌వాసాల్లో పాములు క‌నిపిస్తూనే ఉంటాయి. అలా జ‌న‌వాసాల్లోకి వ‌చ్చే పాములు చాలా వ‌ర‌కు న‌లుపు లేదా బూడిద రంగులో ఉంటాయి. వాటిని చూసే స‌రికి గుండెల్లో రైళ్లు ప‌రుగెడుతాయి.

కానీ ఈ పామును చూస్తే మాత్రం చూడాల‌నిపిస్తూనే ఉంటుంది. ఎలాంటి భ‌యం అనిపించ‌దు. ఎందుకంటే ఆ పాము చూడ‌టానికి తెలుపు రంగులో ఉంది. ఆరేడు అడుగుల పొడ‌వున్న ఆ తెలుపు రంగు పాము చూప‌రుల‌ను ఆక‌ర్షిస్తుంది.

ఇటీవ‌ల హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో కురిసిన వ‌ర్షాల‌కు ఆ తెలుపు రంగు పాము ప్ర‌త్య‌క్ష‌మైంది. ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా ఉన్న ఆ పామును స్థానికులు త‌మ కెమెరాల్లో బంధించి, సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేశారు. ఈ వీడియోను చూస్తే మీరు కూడా ఆశ్చ‌ర్య‌పోతారు. మీరు ఓ లుక్కేయండి మ‌రి.

Latest News