Rashmi Gautham: కాబోయే భర్త ఎవరో చెప్పిన రష్మీ.. సుధీర్ గురించి ఇలా హింట్ ఇచ్చిందా..!
Rashmi Gautham: బుల్లితెరపై క్రేజీ కపుల్‌గా గుర్తు తెచ్చుకున్న జంట సుడిగాలి, సుధీర్, రష్మీ గౌతమ్. వీరిద్దరు జబర్ధస్త్, ఢీతో పాటు పలు షోలు చేశారు. ఈ ఇద్దరు కలిసి ఓ షో చేశారంటే ఆ షో హిట్ కావల్సిందే. అయితే కొన్నాళ్లుగా వీరిద్దరి ప్రేమ, పెళ్లి విషయాలు నెట్టింట తెగ హాట్ టాపిక్ అవుతూ ఉంటాయి. ఆన్ స్క్రీన్ పై వీళ్ళద్దరి పెళ్లి చేయడంతో జీవితంలో సైతం అదే సీన్ రిపీట్ అవుతుందని అభిమానులు అనుకుంటున్నారు . […]

Rashmi Gautham: బుల్లితెరపై క్రేజీ కపుల్‌గా గుర్తు తెచ్చుకున్న జంట సుడిగాలి, సుధీర్, రష్మీ గౌతమ్. వీరిద్దరు జబర్ధస్త్, ఢీతో పాటు పలు షోలు చేశారు. ఈ ఇద్దరు కలిసి ఓ షో చేశారంటే ఆ షో హిట్ కావల్సిందే. అయితే కొన్నాళ్లుగా వీరిద్దరి ప్రేమ, పెళ్లి విషయాలు నెట్టింట తెగ హాట్ టాపిక్ అవుతూ ఉంటాయి. ఆన్ స్క్రీన్ పై వీళ్ళద్దరి పెళ్లి చేయడంతో జీవితంలో సైతం అదే సీన్ రిపీట్ అవుతుందని అభిమానులు అనుకుంటున్నారు . బుల్లితెరపై వీరిద్దరి మధ్య సాగే రొమాన్స్, ఎమోషనల్ డైలాగ్స్, లవ్ సీన్స్ తెగ వైరల్ అవుతుండడంతో ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు.
ఈ క్రమంలోనే రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే పలుమార్లు వీళ్ళిద్దరూ తమ తమ ఫీలింగ్స్ పరోక్షంగా బయట పెడుతుండటం పలు చర్చలకు తావిస్తుంది..తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో రష్మీ గౌతమ్.. తనకు కాబోయే భర్త గురించి చెప్పి ఆశ్చర్య పర్చింది.తను చేసుకునే వాడు చెప్పిందే చేయాలని, చేసిందే చెప్పాలని అంటూ ఓపెన్ కావడంతో అందరూ ఒక్కసారిగా సుడిగాలి సుధీర్ మ్యాటర్ తీస్తున్నారు. అప్పట్లో సుడిగాలి సుధీర్ హీరో’ అంటూ డైలాగ్స్ చెప్పి ఇప్పుడు హీరోగా రాణిస్తున్నాడు. సో.. రష్మీ కామెంట్లను బట్టి చూస్తే ఆమె సుడిగాలి సుధీర్ గురించి ఇలా ఇన్ డైరెక్ట్ హింట్ ఇచ్చేసిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఇటీవల సుధీర్ తన మరదలితో నిశ్చితార్థం జరుపుకున్నాడని, త్వరలో ఆమెని పెళ్లి చేసుకోనున్నాడని ప్రచారం సాగిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం రష్మీ యాంకర్‌గా చేస్తూనే అప్పుడప్పుడు సినిమాలలోను సందడి చేస్తుంది. ఇక సుధీర్ హీరోగా పలు సినిమాలు రూపొందుతున్నాయి. ఇందులో కొన్ని మంచి విజయాలే సాధిస్తున్నాయి. సుధీర్, రష్మీ జంటగా ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నామని గతంలో ఒక నిర్మాత ప్రకటించగా ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి తీసుకెళతారా అని ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏదేమైన సుధీర్, రష్మీ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.