నేను అమెరికా వెళ్లొచ్చేసరికి రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చారు: KA పాల్
ప్రపంచానికి తెలుగు వారి సత్తా చూపిన.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క అవకాశం ఇవ్వండి డిసెంబర్ 7 నుంచి తెలంగాణ జిల్లాల్లో పాదయాత్ర విధాత: దేశాన్ని, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన బీజేపీ, టీఆర్‌ఎస్‌లకు దూరంగా ప్రజలు మార్పు దిశగా ఆలోచన చేయాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. నల్గొండలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ డిసెంబర్ 13న నల్గొండలోని ఎస్.ఆర్ఎన్ గార్డెన్స్ ఫంక్షన్ హల్‌లో ఉమ్మడి నల్గొండలోని పొలిటికల్ లీడర్స్, క్యాస్ట్ లీడర్స్, స్టూడెంట్ […]

- ప్రపంచానికి తెలుగు వారి సత్తా చూపిన..
- వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క అవకాశం ఇవ్వండి
- డిసెంబర్ 7 నుంచి తెలంగాణ జిల్లాల్లో పాదయాత్ర
విధాత: దేశాన్ని, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన బీజేపీ, టీఆర్‌ఎస్‌లకు దూరంగా ప్రజలు మార్పు దిశగా ఆలోచన చేయాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. నల్గొండలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ డిసెంబర్ 13న నల్గొండలోని ఎస్.ఆర్ఎన్ గార్డెన్స్ ఫంక్షన్ హల్‌లో ఉమ్మడి నల్గొండలోని పొలిటికల్ లీడర్స్, క్యాస్ట్ లీడర్స్, స్టూడెంట్ లీడర్స్‌తో ముఖాముఖి సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అక్టోబర్ 30న మునుగోడులో టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే 15 రోజుల్లో మునుగోడును అభివృద్ధి చేస్తానని సీఎం కేసీఆర్ చెప్పారని.. కానీ ముప్పై రోజులైన ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదని విజయోత్సవ ఊరేగింపులకు కోట్ల రూపాయలు ఖర్చు చేశారన్నారు. తెలంగాణ బిడ్డలారా అవినీతి పరులను మీరు నమ్ముతారా.. ఢిల్లీ, పంజాబ్ ప్రజల్లాగా మార్పు కోరుకుంటారో ఆలోచించాలన్నారు. తాను వారం రోజులు అమెరికాకు వెళ్లి వచ్చే సరికి రాష్ట్రం రావణ కాష్టంగా మారిందన్నారు.
ఈడీ రైడ్స్ ద్వారా టీఆర్‌ఎస్ నాయకుల దగ్గర వేల కోట్ల రూపాయలు పట్టుబడటం, రూ. వందల కోట్లతో బీజేపీ వారు ఎమ్మెల్యేలను కొనడం మనం చూస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ 5 లక్షల కోట్ల అప్పులు చేశారని, మోడీ పాలనలో ప్రపంచ దేశాలు భారత్‌కు అప్పులు ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేవన్నారు. షర్మిల వార్తలు మీడియా కవర్ చేయొద్దన్నారు.
షర్మిల అన్న జగన్ నాలుగేళ్ళలో రాజన్న రాజ్యం తీసుకొని రాలేదని, రాక్షస రాజ్యం, అవినీతి రాజ్యం తీసుకొచ్చారని నాలుగైదు లక్షల కోట్ల అప్పులు చేశారని విమర్శించారు.జగన్ ఏపీకి స్పెషల్ స్టేటస్ తీసుకొని రాలేదని, చివరికి జగన్ మోడీ గారికి మసాజ్ చేస్తున్నారని, ప్రపంచానికి తెలుగు వారి సత్తా చూపిన తనకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు ప్రజలు ఒక్క అవకాశం ఇవ్వండని కోరారు. డిసెంబర్ 7 నుంచి తెలంగాణ జిల్లాల్లో పాదయాత్ర చేస్తున్నామన్నారు..
మా సత్తా మునుగోడు ఎన్నికలలో మీరు చూశారని, మునుగోడు ఎన్నికల్లో ఈవీఎంలు మార్చే స్థితికి, గతికి టీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు చేరాయని మునుగోడు ఎన్నిక అంతా కరప్షన్ ఎన్నిక మరొకటి లేదని, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ కూడా ఇదే చెప్పారన్నారు.. ఈవీఎంలు మార్చి గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ నాలుగో సారి గెలవబోతుందని కనుక ఈవీఎంలు మనకు వద్దు బ్యాలెట్ పేపర్లు కావాలని అమెరికా మాదిరిగా మనం కోరుకుందామన్నారు.