తెలంగాణ ‘సివిల్ సప్లయ్స్’ చైర్మన్‌గా కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్
విధాత: తెలంగాణ సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ గా కరీంనగర్ మాజీ మేయర్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా పోటీ చేసిన రవీందర్ సింగ్ అప్పట్లో అధిష్టానం పై తీవ్ర వ్యాఖ్య లు చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు ఆయన ఓటు వేయాలని ఈటల రాజేందర్ కూడా స్థానిక ప్రజాప్రతినిధులను కోరారు. దీంతో ఆయన కూడా బీజేపీలో చేరుతారనే ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత […]

విధాత: తెలంగాణ సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ గా కరీంనగర్ మాజీ మేయర్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా పోటీ చేసిన రవీందర్ సింగ్ అప్పట్లో అధిష్టానం పై తీవ్ర వ్యాఖ్య లు చేసిన సంగతి తెలిసిందే.
అప్పుడు ఆయన ఓటు వేయాలని ఈటల రాజేందర్ కూడా స్థానిక ప్రజాప్రతినిధులను కోరారు. దీంతో ఆయన కూడా బీజేపీలో చేరుతారనే ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత ఆయన సీఎం కేసీఆర్ తో భేటీ కావడంతో పార్టీ మారుతారనే చర్చకు తెరపడింది.
అయితే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో బండి సంజయ్‌కి చెక్ పెట్టడానికే రవీందర్ సింగ్‌కు ప్రాధాన్యం ఇచ్చారనే చర్చ ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో జరుగుతున్నది. ఎందుకంటే రవీందర్ సింగ్ గతంలో బీజేపీలో పనిచేశారు. ఆయన సంజయ్ కంటే సీనియర్ అన్న విషయం విధితమే.