IRCTC Insurance | రైలు టికెట్‌ బుక్‌ చేసుకుంటే ఇక ఆటోమేటిక్‌గా రూ.10లక్షల బీమా.. ఐఆర్‌సీటీసీ కీలక నిర్ణయం..!

IRCTC Insurance | భారతీయ రైల్వేల్లో నిత్యం లక్షలాది మంది ప్రయాణిస్తుంటారు. ప్రయాణికుల సౌలభ్యం కోసం ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) కీలక నిర్ణయం తీసుకున్నది. ఇకపై ఐఆర్‌సీటీసీలో రైలు టికెట్లు బుక్‌ చేసుకునే ప్రయాణికులు ఇకపై ఇన్సూరెన్స్‌ను ప్రత్యేకంగా ఎంచుకోవాల్సిన అవసరం లేదు. డిఫాల్ట్‌గా బీమా సదుపాయాన్ని అందించనున్నట్లు వెల్లడించింది. IRCTC పోర్టల్‌లో రైలు టిక్కెట్లను బుక్ చేసుకునే ప్రయాణికులకు ఆటోమేటిక్‌గా రూ.10లక్షల బీమా కవరేజీ అందించనున్నట్లు సీనియర్‌ అధికారి ఒకరు […]

IRCTC Insurance | రైలు టికెట్‌ బుక్‌ చేసుకుంటే ఇక ఆటోమేటిక్‌గా రూ.10లక్షల బీమా.. ఐఆర్‌సీటీసీ కీలక నిర్ణయం..!

IRCTC Insurance |

భారతీయ రైల్వేల్లో నిత్యం లక్షలాది మంది ప్రయాణిస్తుంటారు. ప్రయాణికుల సౌలభ్యం కోసం ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) కీలక నిర్ణయం తీసుకున్నది.

ఇకపై ఐఆర్‌సీటీసీలో రైలు టికెట్లు బుక్‌ చేసుకునే ప్రయాణికులు ఇకపై ఇన్సూరెన్స్‌ను ప్రత్యేకంగా ఎంచుకోవాల్సిన అవసరం లేదు. డిఫాల్ట్‌గా బీమా సదుపాయాన్ని అందించనున్నట్లు వెల్లడించింది.

IRCTC పోర్టల్‌లో రైలు టిక్కెట్లను బుక్ చేసుకునే ప్రయాణికులకు ఆటోమేటిక్‌గా రూ.10లక్షల బీమా కవరేజీ అందించనున్నట్లు సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.

రూ.10 లక్షల వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజీని ఎంచుకోవడం నుంచి ఐఆర్‌సీటీసీ ఇప్పుడు పథకం ఎంపికను మార్చిందని, మరోమాటలో చెప్పాలంటే పోర్టల్‌లో రైలు టిక్కెట్‌లను బుక్ చేసుకునే ప్రయాణీకులకు ఇకపై ఆటోమేటిక్‌గా రూ.10లక్షల బీమా కవరేజీ అందనున్నది.

బీమా అవసరం లేని వారు బటన్‌పై క్లిక్‌ చేస్తే ఇన్సూరెన్స్‌ నిలిపివేయబడుతుందని పేర్కొంది. అయితే, రూ.10లక్షల వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజీకి ప్రీమియం 0.35 పైసలు మాత్రమే వసూలు చేయడం విశేషం. కాగా, ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో రోజుకు దాదాపు 15లక్షల మంది టికెట్లు బుక్‌ చేసుకుంటున్నట్లు అంచనా.