రూ.15 కోట్ల‌తో పర్వతాల శివాలయ పునః ప్రతిష్టాపన

26, 27, 28 తేదీల్లో జాతర పర్వతగిరిలో కాకతీయ వైభవం మంత్రి స్వగ్రామంలో కార్యక్రమం విధాత, వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రత్యేక ప్రతినిధి: కాకతీయుల కాలంలో నిర్మించిన ఏడు శతాబ్దాల చారిత్రక ప్రాశస్త్యం కలిగిన పర్వతగిరి శివాలయ పునః ప్రతిష్టాపన అంరంగ వైభవంగా చేపట్టేందుకు భారీ స్థాయిలో సన్నాహాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 26,27,28 వ తేదీలలో మూడు రోజులపాటు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. పర్వతగిరి రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి స్వగ్రామం. మంత్రి శ్రద్ధ, […]

  • By: krs    latest    Jan 06, 2023 4:17 PM IST
రూ.15 కోట్ల‌తో పర్వతాల శివాలయ పునః ప్రతిష్టాపన
  • 26, 27, 28 తేదీల్లో జాతర
  • పర్వతగిరిలో కాకతీయ వైభవం
  • మంత్రి స్వగ్రామంలో కార్యక్రమం

విధాత, వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రత్యేక ప్రతినిధి: కాకతీయుల కాలంలో నిర్మించిన ఏడు శతాబ్దాల చారిత్రక ప్రాశస్త్యం కలిగిన పర్వతగిరి శివాలయ పునః ప్రతిష్టాపన అంరంగ వైభవంగా చేపట్టేందుకు భారీ స్థాయిలో సన్నాహాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 26,27,28 వ తేదీలలో మూడు రోజులపాటు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. పర్వతగిరి రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి స్వగ్రామం. మంత్రి శ్రద్ధ, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి తోడ్పాటుతో కార్యక్రమ విజయవంతానికి కృషి చేస్తున్నారు.

రూ.15 కోట్ల వ్యయం

దాదాపు రూ. 15 కోట్లు ఖర్చు చేసి ఆలయ పునః ప్రతిష్టాపన చేస్తున్నారు. జాతరను తలపించేలా చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులంతా పెద్ద ఎత్తున తరలివచ్చేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతీ ఇంటి నుంచి తెచ్చిన జలంతో శివుడికి అభిషేకం చేయాలని సూచించారు. ఇటీవల పర్వతాల శివాలయం ఉన్న గుట్టపైకి వెళ్ళేందుకు నూతనంగా దాదాపు 700 మెట్లను నిర్మించారు.

ఈనెల 26వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ జిల్లా శాఖ అధికారులతో శుక్రవారం శివాలయం వద్ద సమీక్ష ఏర్పాటు చేశారు.

మంత్రి శ్రద్ధ పెడితే…చకచకా

మంత్రి ప్రత్యేక శ్రద్ధ ఉన్నందున అవసరమైన ఏర్పాట్ల కోసం అధికారులను ఆదేశించారు. పర్వతగిరి రిజర్వాయర్ ను లోయర్ మానేర్ డ్యాం నీటితో జాతరనాటికి నింపి ఆహ్లాదం కోసం బోటింగ్ క‌ల్పించ‌నున్నారు. అలాగే ఆరోగ్య పరిరక్షణ కోసం తగినన్ని మెడికల్ క్యాంపులు, పర్వతగిరి నుంచి గుట్ట వరకు తగినని బస్సులు, గుట్టమీదికి వెళ్లడానికి వృద్ధులకు వాహన వసతి ఏర్పాటు చేయనున్నారు.

భక్తులకు విస్తృత ఏర్పాట్లు: మంత్రి ఎర్రబెల్లి

పర్వతాల శివాలయం జాతరకు వచ్చే భక్తులకు విస్తృత ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. జాతరలో భక్తి భావం పెంపొందించే విధంగా శివుడి మీద పర్వతాల శివాలయం కోసం ప్రత్యేకంగా పాటలు రాయించి నేడు విడుదల చేశారు.

జాతర సందర్భంగా సింగర్స్ సునీత, మంగ్లీ, మధుప్రియలను రప్పించాలని నిర్వాహకులకు సూచించారు. రద్దీ నియంత్రణకు, పార్కింగ్ వసతికి ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు.
ఇంటింటికి వెళ్లి ఆహ్వానించాలని సూచించారు.

పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న వసతులను మంత్రి స్వయంగా పర్యవేక్షించారు. అనంతరం ఎలక్ట్రిసిటీ లైన్స్ కు శంకుస్థాపన చేశారు.

మూడు రోజుల పాటు లక్షల్లో భక్తులు వస్తారని అసౌకర్యం కలగకుండా త‌గిన ఏర్పాట్లు చేయాలన్నారు. పవిత్ర కార్యాన్ని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో దేవాదాయశాఖ, పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్, మిషన్ భగీరథ, పోలీస్, వైద్య ఆరోగ్య, ఇరిగేషన్, టూరిజం, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు.