మ‌హారాష్ట్ర‌కు నీళ్లు ఇవ్వ‌డానికి సిద్ధం: CM KCR

విధాత: అదానీపై ఉన్న ప్రేమ‌.. దేశ ప్ర‌జ‌ల‌పై ఉండాలి క‌దా..? కిలో బొగ్గును కూడా దిగుమ‌తి చేసుకోవాల్సిన అవ‌స‌రం లేదు. ప‌వ‌ర్ సెక్టార్ చాలా ముఖ్య‌మైంది. విద్యుత్ రంగాన్ని ప్ర‌యివేటుప‌రం చేయ‌కూడ‌దు. కానీ కేంద్రం అదానీ, అంబానీ,జిందాల్ పాట పాడుతోంది. ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల్ని అడ్డంగా అమ్మేస్తున్నారు. అదానీ అస‌లు రంగు ఇప్పుడు బ‌య‌ట‌ప‌డింది. దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు ఇది పెను ముప్పు. ఇలాంటి కుట్ర‌ల‌పై బీఆర్ఎస్ పోరాటం చేస్తోంది. విద్యుత్ రంగాన్ని ప్ర‌యివేటుప‌రం చేసినా, మేం […]

  • By: krs    latest    Feb 05, 2023 1:55 PM IST
మ‌హారాష్ట్ర‌కు నీళ్లు ఇవ్వ‌డానికి సిద్ధం: CM KCR

విధాత: అదానీపై ఉన్న ప్రేమ‌.. దేశ ప్ర‌జ‌ల‌పై ఉండాలి క‌దా..? కిలో బొగ్గును కూడా దిగుమ‌తి చేసుకోవాల్సిన అవ‌స‌రం లేదు. ప‌వ‌ర్ సెక్టార్ చాలా ముఖ్య‌మైంది. విద్యుత్ రంగాన్ని ప్ర‌యివేటుప‌రం చేయ‌కూడ‌దు. కానీ కేంద్రం అదానీ, అంబానీ,జిందాల్ పాట పాడుతోంది. ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల్ని అడ్డంగా అమ్మేస్తున్నారు. అదానీ అస‌లు రంగు ఇప్పుడు బ‌య‌ట‌ప‌డింది. దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు ఇది పెను ముప్పు. ఇలాంటి కుట్ర‌ల‌పై బీఆర్ఎస్ పోరాటం చేస్తోంది.

విద్యుత్ రంగాన్ని ప్ర‌యివేటుప‌రం చేసినా, మేం జాతీయం చేస్తాం. బొగ్గు గ‌నులున్న అన్ని ప్రాంతాల‌కు రైల్వే లైన్లు వేస్తాం. రైల్వే లైన్ల కోసం కోల్ ఇండియా నిధులు ఇచ్చినా.. కేంద్రం వేయ‌లేదు. థ‌ర్మ‌ల్ విద్యుత్ కేంద్రాల‌కు విదేశీ బొగ్గు దిగుమ‌తి చేసుకోవాల‌ని కేంద్రం జ‌బ‌ర్ద‌స్తీ ఏంటి? అదానీకి ప్ర‌యోజ‌నం క‌లిగించ‌డానికే బొగ్గు దిగుమ‌తికి ఒత్తిడి. దేశంలో బొగ్గు దిగుమ‌తి చేసుకోవాల్సిన అవ‌స‌ర‌మే లేదు.

దేశంలో 90 శాతం విద్యుత్ రంగాన్ని ప్ర‌భుత్వ ప‌రిధిలోనే ఉంచుతాం. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే రెండేండ్ల‌లోనే దేశంలో నిరంత‌ర వెలుగులు తీసుకొస్తాం. న్యూయార్క్‌, లండ‌న్‌లో క‌రెంట్ పోయినా హైద‌రాబాద్‌లో పోదు. హైద‌రాబాద్‌ను ప‌వ‌ర్ హైల్యాండ్‌గా మార్చాం.

చ‌ట్ట స‌భ‌ల్లో మ‌హిళ‌ల‌కు 33 శాతం రిజ‌ర్వేష‌న్లు

మ‌హిళ‌ల ప్రాతినిధ్యం ఉన్న స‌మాజం అద్భుతంగా ప్ర‌గ‌తి సాధిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే చ‌ట్ట స‌భ‌ల్లో మ‌హిళ‌ల‌కు 33 శాతం రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేస్తాం. ఆ హామీని ఏడాదిలోపే అమ‌లు చేస్తాం. మ‌హిళ‌ల‌ను కేంద్రం చిన్న‌చూపు చూస్తోంది.

మ‌హిళ‌ల ప్రాతినిధ్యం పెరిగితేనే అభివృద్ధి సాధ్యం. బీఆర్ఎస్ అధికారంలోకి వ‌స్తే మ‌హిళ‌ల కోసం కొత్త పాల‌సీ తీసుకొస్తాం. అన్ని రంగాల్లోనూ వారి ప్రాధాన్యం పెంచుతాం. ప్ర‌తి అసెంబ్లీ, మండ‌లిలో మ‌హిళ‌ల‌కు 33 శాతం రిజ‌ర్వేష‌న్లు త‌ప్ప‌కుండా అమ‌లు చేస్తాం. భేటీ ప‌డావో.. భేటీ బ‌చావో మాట‌ల‌కే ప‌రిమితం అయింది. హ‌థ్ర‌స్ ఘ‌ట‌న మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ లేద‌ని నిరూపించింది.

బాబ్లీ ప్రాజెక్టు పేరుతో డ్రామా

బాబ్లీ ప్రాజెక్టు పేరుతో ఏపీ, తెలంగాణ‌, మ‌హారాష్ట్ర ప్ర‌జ‌ల‌తో డ్రామా ఆడారు. అస‌లు బాబ్లీ ప్రాజెక్టు విష‌యంలో వివాద‌మే లేదు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చాక ఇక‌ వివాదం ఎక్క‌డిది? మ‌హారాష్ట్ర స‌హ‌కారంతోనే కాళేశ్వ‌రం ప్రాజెక్టు పూర్త‌యింది. గోదావ‌రిలో 2 నుంచి 3 వేల టీఎంసీల వ‌ర‌ద పారుతుంది. గోదావ‌రి నుంచి వృధాగా పోతున్న నీళ్ల‌ను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని చెప్పాం.

మూడు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌ను కూర్చోబెట్టి, గోదావ‌రి జ‌లాల స‌మ‌స్య ప‌రిష్క‌రించ‌లేదా..? మ‌హారాష్ట్ర‌కు అవ‌స‌ర‌మైతే శ్రీరాంసాగ‌ర్ నుంచి కూడా నీళ్లు లిఫ్ట్ చేసుకోవ‌చ్చు. తాము మ‌హారాష్ట్ర‌కు హృద‌య‌ పూర్వ‌కంగా నీళ్లు ఇవ్వ‌డానికి సిద్ధంగా ఉన్నాం అని పేర్కొన్నారు. న‌దుల అనుసంధానంపై ఏకంగా పుస్త‌కాలే వ‌చ్చాయి.. పాల‌కులే అనుస‌రించ‌డం లేదు.