కంటోన్మెంట్‌ బోర్డులకు ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఎట్ట‌కేల‌కు సికింద్రాబ‌ద్ కంటోన్మెంట్‌ బోర్డుకు ఎన్నిక‌లు విధాత‌: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డు (Secunderabad Contonment Board) ఎన్నికల నగారా మోగింది. ఏడాది కాలంగా నామినేటెడ్‌ సభ్యుల ద్వారా పాలన సాగిస్తున్న సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌తో పాటు దేశంలోని 57 కంటోన్మెంట్‌ బోర్డులకు ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర రక్షణ శాఖ విడుదల చేసింది. ఏప్రిల్‌ 30 పోలింగ్‌ నిర్వహించనున్నట్లు రక్షణ శాఖ సంయుక్త కార్యదర్శి ఈ మేరకు నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ పరిధిలో 8 వార్డులు ఉన్నాయి. […]

కంటోన్మెంట్‌ బోర్డులకు ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఎట్ట‌కేల‌కు సికింద్రాబ‌ద్ కంటోన్మెంట్‌ బోర్డుకు ఎన్నిక‌లు

విధాత‌: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డు (Secunderabad Contonment Board) ఎన్నికల నగారా మోగింది. ఏడాది కాలంగా నామినేటెడ్‌ సభ్యుల ద్వారా పాలన సాగిస్తున్న సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌తో పాటు దేశంలోని 57 కంటోన్మెంట్‌ బోర్డులకు ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర రక్షణ శాఖ విడుదల చేసింది.

ఏప్రిల్‌ 30 పోలింగ్‌ నిర్వహించనున్నట్లు రక్షణ శాఖ సంయుక్త కార్యదర్శి ఈ మేరకు నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ పరిధిలో 8 వార్డులు ఉన్నాయి.

ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో అధికారులు ఎన్నికల నిర్వహణపై ఏర్పాట్లు మొదలు పెట్టనున్నారు. క్షేత్రస్థాయిలో ఓటర్ల జాబితాపై బోర్డు అధికార యంత్రాంగం ఇప్పటికే కసరత్తు ప్రారంబించినట్టు సమాచారం.