కాళేశ్వరంపై తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టులో ఊరట
విధాత,హైదరాబాద్: కాళేశ్వరంపై సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి ఊరటనిచ్చింది. మూడో టీఎంసీపై జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం స్టేటస్ కో ఉత్తర్వులను సవరించింది. మూడో టీఎంసీ కోసం తెలంగాణ ప్రభుత్వం అనుమతుల కోసం దాఖలు చేసిన విజ్ఞప్తులను పరిశీలించవచ్చని గోదావరి బోర్డు, సీడబ్ల్యూసీలకు అనుమతి ఇచ్చింది. అయితే, తుది ఉత్తర్వుల మేరకు అనుమతులు లోబడి ఉంటాయని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. పరిహారం తీసుకొని.. భూములు ఇవ్వదలచుకున్న రైతులకు కోర్టు అనుమతి ఇచ్చింది. కాళేశ్వరం […]

విధాత,హైదరాబాద్: కాళేశ్వరంపై సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి ఊరటనిచ్చింది. మూడో టీఎంసీపై జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం స్టేటస్ కో ఉత్తర్వులను సవరించింది. మూడో టీఎంసీ కోసం తెలంగాణ ప్రభుత్వం అనుమతుల కోసం దాఖలు చేసిన విజ్ఞప్తులను పరిశీలించవచ్చని గోదావరి బోర్డు, సీడబ్ల్యూసీలకు అనుమతి ఇచ్చింది.
అయితే, తుది ఉత్తర్వుల మేరకు అనుమతులు లోబడి ఉంటాయని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. పరిహారం తీసుకొని.. భూములు ఇవ్వదలచుకున్న రైతులకు కోర్టు అనుమతి ఇచ్చింది. కాళేశ్వరం మూడో టీఎంసీ కోసం భూసేకరణను వ్యతిరేకిస్తూ సుప్రీంలో చెరుకు శ్రీనివాస్‌రెడ్డితో పాటు పలువురు రైతులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. స్టేటస్‌కో విధించింది.
తుది తీర్పు వచ్చేలోగా అనుమతులపై గోదావరి బోర్డు, సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకునేలా స్టేటస్ కో ఆర్డర్‌లో సవరణ చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. తుది తీర్పుకు కట్టుబడి ఉంటామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. రాజకీయ పరమైన కారణాలతోనే కాళేశ్వరం పనులకు అడ్డుపడుతున్నారని తెలంగాణ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ కోర్టులో వాదనలు వినిపించారు.