మెదక్: వైభవంగా రేణుకా మాతకు బోనాలు..

బోనమెత్తిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి.. పాల్గొన్న ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి….. ఆలయంలో ప్రత్యేక పూజలు విధాత, మెదక్ బ్యూరో: జిల్లా కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి మహిళలు పెద్ద ఎత్తున రేణుకా మాతకు బోనాలు సమర్పించారు. రాందాస్ చౌరస్తాలో పట్టణ నలు మూలల నుండి డప్పు చప్పుళ్ళతో ర్యాలీగా మహిళలు బోనాలతో తరలి వచ్చారు. రాందాస్ చౌరస్తా నుండి రేణుకా మాత దేవాలయం వరకు ర్యాలీ సాగింది. బోనాల పండుగ కన్నుల పండువగా […]

మెదక్: వైభవంగా రేణుకా మాతకు బోనాలు..
  • బోనమెత్తిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి..
  • పాల్గొన్న ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి…..
  • ఆలయంలో ప్రత్యేక పూజలు

విధాత, మెదక్ బ్యూరో: జిల్లా కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి మహిళలు పెద్ద ఎత్తున రేణుకా మాతకు బోనాలు సమర్పించారు. రాందాస్ చౌరస్తాలో పట్టణ నలు మూలల నుండి డప్పు చప్పుళ్ళతో ర్యాలీగా మహిళలు బోనాలతో తరలి వచ్చారు. రాందాస్ చౌరస్తా నుండి రేణుకా మాత దేవాలయం వరకు ర్యాలీ సాగింది.

బోనాల పండుగ కన్నుల పండువగా జరిగింది. ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి బోనం ఎత్తి రేణుక మాతకు సమర్పించారు. అనంత‌రం ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి ఆలయ కమిటీ అధ్యక్షుడు సురేందర్ గౌడ్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున గౌడ్ కౌన్సిలర్లు లక్ష్మీనారాయణ గౌడ్ గడ్డమీద కృష్ణా గౌడ్ , జనార్దన్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.