వరంగల్: రిజర్వు ఇన్స్పెక్టర్ సతీష్ అరెస్టు?
విధాత, వరంగల్: గోల్డ్ స్టోన్ వ్యాపారిని బెదిరించిన సంఘటనలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ సతీష్ ను పోలీస్ ఉన్నతాధికారి అదేశాలతో శుక్రవారం సుబేదారి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు సమాచారం. సతీష్ ప్రస్తుతం వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో ఆర్‌ఐగా విధులు నిర్వహిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం గోల్డ్ స్టోన్ వ్యాపారిని సతీష్ డబ్బుల కోసం బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై సుబేదారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా విచారించిన అనంతరం ఆర్.ఐ అరెస్టుకు గ్రీన్ సిగ్నల్ […]

విధాత, వరంగల్: గోల్డ్ స్టోన్ వ్యాపారిని బెదిరించిన సంఘటనలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ సతీష్ ను పోలీస్ ఉన్నతాధికారి అదేశాలతో శుక్రవారం సుబేదారి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు సమాచారం.
సతీష్ ప్రస్తుతం వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో ఆర్‌ఐగా విధులు నిర్వహిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం గోల్డ్ స్టోన్ వ్యాపారిని సతీష్ డబ్బుల కోసం బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై సుబేదారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా విచారించిన అనంతరం ఆర్.ఐ అరెస్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.
దీంతో శుక్రవారం అరెస్ట్ చేసినట్లు తెలిసింది. ఒకటి రెండు రోజుల్లో సతీష్ ను సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇటీవలనే కమిషనరేట్ పరిధిలో ఒక సీఐ సహా ఇద్దరు ఎస్ఐలను సిపి రంగనాథ్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. తాజా ఈ అరెస్టుతో సిపి చర్యలపై అక్రమార్కుల్లో ఆందోళన నెలకొంది.