కళ్ళలో కారం కొట్టి గొంతు కోసి.. దొంగల చేతిలో రిటైర్డ్‌ టీచర్‌ హతం

ఏపీలోని నంద్యాలలో దారుణం చోటుచేసుకొంది. కళ్ళల్లో కారం కొట్టి, గొంతు కోసి రిటైర్డ్ టీచర్‌ను దోపిడీ దొంగలు దారుణంగా హత్య చేశారు.

  • By: Somu    latest    Dec 22, 2023 11:47 AM IST
కళ్ళలో కారం కొట్టి గొంతు కోసి.. దొంగల చేతిలో రిటైర్డ్‌ టీచర్‌ హతం

నంద్యాల : ఏపీలోని నంద్యాలలో దారుణం చోటుచేసుకొంది. కళ్ళల్లో కారం కొట్టి, గొంతు కోసి రిటైర్డ్ టీచర్‌ను దోపిడీ దొంగలు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన నంద్యాలలోని హౌసింగ్ బోర్డు కాలనీలో చోటు చేసుకుంది. మృతురాలు గ్లాడిస్‌ అనే రిటైర్డ్ టీచర్‌గా గుర్తించారు. మృతురాలికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వారికి పెళ్లి చేసిన ఆమె.. ఒంటరిగానే నివసిస్తున్నారు. భర్త మోహన్ సుధాకర్ రావు దూరదర్శన్ లో పనిచేస్తూ రిటైర్మెంట్ తర్వాత మృతి చెందారు. ఇద్దరు కూతుళ్లు పెళ్లి చేసుకొని హైదరాబాద్‌లో స్థిరపడడంతో గ్లాడీస్ ఒంటరిగా ఉంటున్నారు. దుండగులు పక్కాగా రెక్కీ చేసి, టీచర్ ఇంటిని టార్గెట్ చేసుకున్నట్లు తెలిసింది.


కాగా.. ఆమె ఒంటరిగా ఉందని తెలుసు కొని ఆమె ఇంటికి దొంగలు వెళ్లారు. వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో టీచరు కళ్ళల్లో కారం కొట్టి గొంతు కోసి హత్య చేశారని పోలీసులు తెలిపారు. స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం సహాయంతో ఆధారాలను సేకరిస్తున్నారు. దుండగులు ఎంత సొమ్ము దోచుకున్నారనే విషయంపై ఆరా తీస్తున్నారు. భారీగా బంగారం నగదు అపహరించినట్లు మృతురాలి బంధువులు పోలీసులకు వెల్లడించినట్లు తెలిసింది. మృతురాలి కూతుర్లు, బంధువుల ఫిర్యాదు నేపథ్యంలో కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.