Warangal: రేవంత్, బండిల జెండాలే వేరు, ఎజెండా ఒక్కటే: పెద్ది
ప్రతిపక్ష పార్టీల అధ్యక్షులు బండి సంజయ్, రేవంత్ రెడ్డి.. పంట చేను పరిశీలించి, రైతును ఓదార్చిన పాపాన పోలేదు సీఎం సుడిగాలి పర్యటన చేసినా ప్రతిపక్షాలకు కనీస సోయి లేదు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ప్రతిపక్ష పార్టీల అధ్యక్షులు రేవంత్, బండిలది జెండాలే వేరు.. కానీ ఎజెండా మాత్రం ఒక్కటేనని, సీఎం సుడిగాలి పర్యటన చేసినా ప్రతిపక్ష నేతలకు సోయి లేదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి […]

- ప్రతిపక్ష పార్టీల అధ్యక్షులు బండి సంజయ్, రేవంత్ రెడ్డి..
- పంట చేను పరిశీలించి, రైతును ఓదార్చిన పాపాన పోలేదు
- సీఎం సుడిగాలి పర్యటన చేసినా ప్రతిపక్షాలకు కనీస సోయి లేదు
- నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ప్రతిపక్ష పార్టీల అధ్యక్షులు రేవంత్, బండిలది జెండాలే వేరు.. కానీ ఎజెండా మాత్రం ఒక్కటేనని, సీఎం సుడిగాలి పర్యటన చేసినా ప్రతిపక్ష నేతలకు సోయి లేదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు. బండి సంజయ్, రేవంత్ రెడ్డిలు ఇప్పటి వరకూ ఒక్క పంట చేను పరిశీలించి, ఒక్క రైతును కూడా ఓదార్చిన పాపాన పోలేదని మండిపడ్డారు.
నర్సంపేటలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. దమ్ముంటే మీరు నర్సంపేటకు రండి, ఎంత నష్టం జరిగిందో మీకే తెలుస్తుందన్నారు. సన్న, చిన్న కారు రైతులతో కలిసి ముఖ్యమంత్రి కేసిఆర్ పొలాల్లో తిరిగారని అన్నారు. వడగళ్ల వానకు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి హామీనిచ్చారని గుర్తుచేశారు.
రైతు బాంధవుడు కేసీఆర్
ఎకరాకు రూ.10 వేల ఇన్పుట్ సబ్సిడీ మంజూరు చేస్తూ సర్వే చేయాలని సంబంధిత అధికారులను సిఎం ఆదేశించారని తెలిపారు. నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించి ప్రాథమిక నివేదిక ప్రకారం 32193 ఎకరాల వివిధ రకాల పంట నష్టం జరిగిందన్నారు. ఇంకా వడగండ్ల వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ వారు హెచ్చరించినందున రైతులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. రాజకీయాలకు సంబంధం లేకుండా సర్వేలు నిర్వహించనున్నట్లు వివరించారు. నర్సంపేట నియోజకవర్గంలో 10 వేల PVC పైప్ ల యూనిట్లను, అదేవిధంగా10 వేల టార్పాలిన్ యూనిట్లను సబ్సిడీ రూపంలో రైతులకు అందజేయాలని సీఎం చెప్పారని వివరించారు.
నిధుల విడుదల్లో కేంద్రం నిర్లక్ష్యం
NDRF నిధుల నుండి ఒక్క పైసా కూడా తెలంగాణకు ఇవ్వలేదన్నారు. NDRF నిధులు రూ.1816 కోట్లు విదలచేస్తే కేవలం ఎన్నికలు జరిగే 5 రాష్ట్రలకు మాత్రమే ఇచ్చారని ఎమ్మెల్యే విమర్శించారు. వ్యవసాయం వదిలి పెట్టి రైతులను భూమికి వేరు చేయాలని చూసే పార్టీయే bjp పార్టీ అంటూ విమర్శించారు. కేంద్రం నుంచి రూపాయి వచ్చేది లేదు.. సచ్చేది లేదన్నారు.
ఇచ్చే సహాయం సరిపోత లేదంటున్న బండి సంజయ్.. దమ్ముంటే ఇంత కన్న ఎక్కువ తీసుకురా అంటూ సవాల్ చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్లే పంటల ధరలు తగ్గుముఖం పడుతున్నాయని, సీసీఐని నిర్వీర్యం చేస్తామన్న ప్రకటన వల్ల పత్తి ధర పతనమైందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని గౌరవప్రదంగా జరిగేలా, రైతులు ఆత్మగౌరవంగా బ్రతికేలా చూసేది కేసీఆర్ మాత్రమేనని పెద్ది సుదర్శన్‌రెడ్డి తెలియచేశారు.