దాసోజు.. రేవంత్ చెప్పిందే నిజమైంది..! బీజేపీలో చేరినప్పుడే పండుగ.. ఆ తర్వాత అంతా!
Revanth Reddy | రాజకీయాల్లో భాగంగా పార్టీలు మారడం సహజమే. కానీ కొంతమంది నాయకులు తమకు పదవులు రాకపోయినా.. అంకితభావంతో ఒకే పార్టీలో కొనసాగుతారు. కొందరైతే పదవులు రాకపోయేసరికి అసంతృప్తితో.. ఇతర పార్టీలకు జంప్ అవుతుంటారు. అదేదో ఆ పార్టీలోనైనా ఉంటారా? అనుకుంటే ఉండనే ఉండరు. నెలల వ్యవధిలోనే ఆయా పార్టీల కండువాలు కప్పేసుకుంటారు. ఈ సీన్ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన ఒకరిద్దరు నేతలు […]

Revanth Reddy | రాజకీయాల్లో భాగంగా పార్టీలు మారడం సహజమే. కానీ కొంతమంది నాయకులు తమకు పదవులు రాకపోయినా.. అంకితభావంతో ఒకే పార్టీలో కొనసాగుతారు. కొందరైతే పదవులు రాకపోయేసరికి అసంతృప్తితో.. ఇతర పార్టీలకు జంప్ అవుతుంటారు. అదేదో ఆ పార్టీలోనైనా ఉంటారా? అనుకుంటే ఉండనే ఉండరు. నెలల వ్యవధిలోనే ఆయా పార్టీల కండువాలు కప్పేసుకుంటారు.
ఈ సీన్ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన ఒకరిద్దరు నేతలు ఇతర పార్టీల్లో చేరారు. అదే విధంగా అధికార పార్టీ కూడా ఇతర పార్టీల నేతలను ఆకర్షిస్తోంది. తమ పార్టీని వీడిన నేతలను సొంత గూటికి తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు మొదలు పెట్టింది. అందులో భాగంగానే మొన్న బూడిద భిక్షమయ్య గౌడ్, నిన్న స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్ గులాబీ కండువా కప్పుకున్నారు.
అయితే ఈ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం ఓ వీడియో వైరల్ అవుతోంది. అదే రేవంత్ రెడ్డికి చెందిన వీడియో. గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీలో చేరిన సందర్భంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ప్రత్యేకంగా దాసోజు శ్రవణ్ కు ఈ వ్యాఖ్యలు సరిపోయేలా ఉన్నాయని కాంగ్రెస్ కార్యకర్తలు పేర్కొంటున్నారు. పువ్వుల దాసోహానికి పోయిన దాసోసు వినవయ్యా అంటూ ఆ వీడియోను షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండింగ్లో ఉంది.
రేవంత్ వ్యాఖ్యలివే.. బీజేపీలో చేరినప్పుడు, కండువా కప్పుకున్నప్పుడే పండుగ. ఆ తర్వాత ఎవరికి చెప్పుకోవాల్నో తెల్వక బాత్రూమ్ లోకి పోయి తలుపు మూసి ఏడ్సి తర్వాత చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోని బయటకు రావాల్సిన పరిస్థితి ఉంటది. బీజేపీ అనేది ఊబి. దూరం నుంచి చూస్తే నున్నగా మెరిసినట్టు కనిపిస్తది. ఒకసారి అందులో ముఖం పెట్టినమంటే అంతే. ఇప్పుడెందుకు 100 రోజుల తర్వాత ఏం జరుగుతదో మనం ఇక్కడ్నే చూస్తాం అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దాసోజు శ్రవణ్ సరిగ్గా బీజేపీలో చేరి 100 రోజులు గడవలేదు. కేవలం రెండున్నర నెలలు మాత్రమే ఆ పార్టీలో పని చేశారు.