Revanth Reddy | ప్రతి నియోజకవర్గంలో 12 వేల కాంగ్రెస్ ఓట్లు తొలగించారు: రేవంత్ రెడ్డి
Revanth Reddy 5 ఓట్లున్న ఇంట్లో.. రెండు ఓట్లు తీసి వేశారు ఈ నెల15లోగా మండల, డివిజన్ అధ్యక్షుల నియామకం ఈనెల 18న ట్రైనింగ్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విధాత: రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు వచ్చే 12వేల ఓట్లను తొలగించారని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓటరు జాబితాలో అవకతవకలు జరిగాయన్నారు. గురువారం గాంధీభవన్‌లో జరిగిన పార్టీ లీడర్‌షిప్ డెవలప్మెంట్ మిషన్ వర్క్ షాప్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కుటుంబానికి 5 […]

Revanth Reddy
- 5 ఓట్లున్న ఇంట్లో.. రెండు ఓట్లు తీసి వేశారు
- ఈ నెల15లోగా మండల, డివిజన్ అధ్యక్షుల నియామకం
- ఈనెల 18న ట్రైనింగ్
- టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
విధాత: రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు వచ్చే 12వేల ఓట్లను తొలగించారని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓటరు జాబితాలో అవకతవకలు జరిగాయన్నారు. గురువారం గాంధీభవన్‌లో జరిగిన పార్టీ లీడర్‌షిప్ డెవలప్మెంట్ మిషన్ వర్క్ షాప్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కుటుంబానికి 5 ఓట్లు ఉంటే 2 ఓట్లు డిలీట్ చేశారన్నారు.
బూత్‌లు మార్చి ఓటరును గందరగోళానికి గురిచేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వీటన్నింటినీ ఎదుర్కొవడంలో బూత్ లెవెల్ ఏజెంట్లే కీలకమన్నారు. బూత్‌ల వారీగా ఓటర్ లిస్టును క్షుణంగా పరిశీలించాలన్నారు. ఓటరు జాబితా సరిగా ఉంటే సగం ఎన్నికలు గెలిచినట్లేనని తెలిపారు. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు. పరిపాలన ముసుగులో రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు.
120 రోజులు ఇంటికి సెలవు పెట్టి పని చేయండి
రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి, 120 రోజులు ఇంటికి సెలవు పెట్టి కష్టపడి పని చేయాలని కార్యకర్తలకు రేవంత్ పిలుపు ఇచ్చారు. బీజేపీని, బీఆరెస్‌ను వేరుగా చూడొద్దన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఎన్నికల చట్టాల్లో మార్పులను ఉపయోగించుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నాయన్నారు.
దీనిని ఎదుర్కొనేందుకు చేయాల్సిన కార్యాచరణ కోసమే ఈ కార్యక్రమం అని అన్నారు. ఇతర పార్టీలను ఎన్నికల్లో ధీటుగా ఎదుర్కొనేందుకు మనం సంసిద్ధం కావాలన్నారు. బీజేపీ, బీఆర్ఎస్‌ను ఎదుర్కొనేందుకు మన శ్రేణులను ఎన్నికలకు సంసిద్ధులను చేసుకోవాలన్నారు.
అప్రమత్తంగా ఉండాలి
గాంధీ భవన్ నుంచి, గ్రామస్థాయి వరకు అందరూ అప్రమత్తంగా ఉండి పనిచేయాలని రేవంత్ తెలిపారు. మండల, డివిజన్, జిల్లా, పట్టణ అధ్యక్షులకు బోయినపల్లి రాజీవ్ నాలెడ్జ్ సెంటర్ లో జూలై 18న ట్రైనింగ్ ఉంటుందన్నారు.
ఈ నెల 15లోగా మండలాలు, డివిజన్ అధ్యక్షుల నియామకాలు పూర్తి చేస్తామన్నారు. ఎన్ రోలర్సే బీఎల్ఏ
రాష్ట్రంలో 34,654 పోలింగ్ బూత్ లు ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గతంలో పని చేసిన పార్టీ బూత్ ఎన్ రోలర్సే బీఎల్ఏలన్నారు. యాక్టివ్ గా ఉన్న బూత్ ఎన్ రోలర్స్‌ను బీఎల్ఏలుగా నియమిచుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విభాగాల ఇంచార్జ్ కొప్పుల రాజు, కర్ణాటక రాష్ట్ర ఎలక్షన్ వార్ రూమ్ ఇంచార్జ్ ససికాంత్ సెంథిల్, జిల్లా అద్యక్షులతో పాటు పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.