Revanth Reddy | కలియుగ నియంతలా మోడీ: టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి

రాహుల్‌పై కేంద్రం చర్యలు దుర్మార్గం తీవ్రంగా ఖండిచిన తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపు ఇచ్చిన తెలంగాణ కిసాన్‌ కాంగ్రెస్‌ విధాత: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కలియుగ నియంతలా వ్యవహరిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. శుక్రవారం ఆయన తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) పై కేంద్రం చర్యలు దుర్మార్గమన్నారు. భారత్ జోడో యాత్ర తరువాత రాహుల్‌పై […]

Revanth Reddy | కలియుగ నియంతలా మోడీ: టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి
  • రాహుల్‌పై కేంద్రం చర్యలు దుర్మార్గం
  • తీవ్రంగా ఖండిచిన తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు
  • రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపు ఇచ్చిన తెలంగాణ కిసాన్‌ కాంగ్రెస్‌

విధాత: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కలియుగ నియంతలా వ్యవహరిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. శుక్రవారం ఆయన తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) పై కేంద్రం చర్యలు దుర్మార్గమన్నారు. భారత్ జోడో యాత్ర తరువాత రాహుల్‌పై బీజేపీ కక్ష సాధింపుకు పాల్పడుతోందన్నారు. అదానీ కుంభకోణంపై చర్చ జరగకుండా ఉండేందుకే ప్రభుత్వం ఇలా చేస్తోందన్నారు.

దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితి ఉందని, దీనిని కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటుందన్నారు. బీజేపీ రాజకీయ కక్ష సాధింపుకు పాల్పడుతోందని రేవంత్‌ ఆరోపించారు. అలాగే రాహుల్‌ గాంధీ పార్లమెంట్‌ సభ్యత్వాన్ని రద్దు చేయడాన్నీ తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు తీవ్రంగా ఖండించారు. గాంధీ భవన్ వద్ద ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు దగ్ధం చేశారు.

తీవ్రంగా ఖండించిన నేత‌లు

ఏఐసీసీ వ్యవహారాల ఇంచార్జీ మాణిక్యం ఠాక్రేతో పాటు సీఎల్‌పీ నేత మల్లు, భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు సీతక్క, శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, టీపీసీసీ నాయకులు నిరంజన్‌, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌లు తీవ్రంగా ఖండించారు. రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు దేశానికి చీకటి రోజుగా అభివర్ణించారు. ప్రజాస్వామ్యాన్ని పార్లమెంట్‌ సాక్షిగా పాతరేశారన్నారు. గాంధీ పేరు వినపడకుండా గాడ్సే వారుసులు పన్నిన కుట్రగా సీతక్క అభివర్ణించారు.

రాష్ట్ర‌ వ్యాప్తంగా నిరసనలకు పిలుపు

రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ నిరసనలు చేయాలని తెలంగాణ కిసాన్‌ కాంగ్రెస్‌ పిలుపు ఇచ్చింది. అన్ని జిల్లాల్లో అన్ని మండల కేంద్రాల్లో నిరసనలు చేయాలని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ పాలనకు, ప్రశ్నించే గొంతులను అణచివేస్తున్న మోడీ, అమిత్ షా ల దిష్టి బొమ్మలను దగ్ధం చేయాలని కోరింది. ఈ మేరకు తెలంగాణ కిసాన్‌ కాంగ్రెస్‌ చైర్మన్‌ సుంకేట అన్వేష్‌రెడ్డి ప్రకటనలో తెలిపారు.