విధాత: పవన్ కళ్యాణ్, చంద్రబాబుల భేటి ముగిసింది. లోపల వాళ్లిద్దరూ ఏం మాట్లాడుకున్నారో గానీ బయటికి పొక్కలేదు. రాజకీయ నాయకులు, ఎన్నికలు సమీపిస్తున్న టైములో సీట్ల గురించే మాట్లాడుకుంటారు అంతేగా.. సరే ఈ భేటి గురించి సహజంగానే సీపీ మంత్రులు విరుచుకుపడ్డారు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కూడా ఎగిరిపడింది. చంద్రబాబు సభల్లో తొక్కిసలాట జరిగి జనం చనిపోయినా స్పందించని పవన్ కళ్యాణ్ ఇప్పుడు కుప్పంలో చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారంటూ పరామర్శకు వెళ్లడం ఏమిటని వైసీపీ క్యాంప్ నిలదేస్తోంది. […]
విధాత: పవన్ కళ్యాణ్, చంద్రబాబుల భేటి ముగిసింది. లోపల వాళ్లిద్దరూ ఏం మాట్లాడుకున్నారో గానీ బయటికి పొక్కలేదు. రాజకీయ నాయకులు, ఎన్నికలు సమీపిస్తున్న టైములో సీట్ల గురించే మాట్లాడుకుంటారు అంతేగా.. సరే ఈ భేటి గురించి సహజంగానే సీపీ మంత్రులు విరుచుకుపడ్డారు.
వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కూడా ఎగిరిపడింది. చంద్రబాబు సభల్లో తొక్కిసలాట జరిగి జనం చనిపోయినా స్పందించని పవన్ కళ్యాణ్ ఇప్పుడు కుప్పంలో చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారంటూ పరామర్శకు వెళ్లడం ఏమిటని వైసీపీ క్యాంప్ నిలదేస్తోంది.
ఇవన్నీ సహజమే కానీ మెగా ఫామిలీ.. పవన్ కళ్యాణ్, చిరంజీవి మీద కలబడే ఛాన్స్ వస్తే మాత్రం అందరికన్నా ముందుండే రామ్ గోపాల్ వర్మ యథావిధిగా ఈ పవన్ చంద్రబాబుల భేటి మీద కూడా గట్టిగానే స్పందించాడు. కేవలం తన సొంత ప్రయోజనాలు కోసమే పవన్ కళ్యాణ్ తన పార్టీని చంద్రబాబుకు తాకట్టు పెట్టేశారని ఆర్జీవి విరుచుకుపడ్డారు.
కేవలం డబ్బు కోసం తన సొంత కాపుల్ని ,కమ్మోళ్లకి అమ్మేస్తాడని ఊహించలేదు ..RIP కాపులు , కాంగ్రాట్యులేషన్స్ కమ్మోళ్ళు