సద్దాం కొడుకు.. బండి కొడుకు రూపంలో పుట్టాడు: RGV

విధాత: ఆంధ్ర తెలంగాణల్లో చోటు చేసుకునే పొలిటికల్, సామాజిక అంశాల మీద తరచూ స్పందించే రామ్ గోపాల్ వర్మ తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడు భగీరథ్ ఓ యూనివర్సిటీలో సహచర విద్యార్థిని చితకబాదిన ఘటన మీద గట్టిగా రెస్పాండ్ అయ్యారు. ఒకనాటి ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ కుమారులు ఉదయ్.. ఖాసే కూడా ఇలాగే ఆరాచకంగా ఉండేవారు అంటూ ఆర్జీవి ట్వీట్ చేశారు. నిన్నా మోన్నా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి […]

  • By: krs    latest    Jan 19, 2023 8:25 AM IST
సద్దాం కొడుకు.. బండి కొడుకు రూపంలో పుట్టాడు: RGV

విధాత: ఆంధ్ర తెలంగాణల్లో చోటు చేసుకునే పొలిటికల్, సామాజిక అంశాల మీద తరచూ స్పందించే రామ్ గోపాల్ వర్మ తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడు భగీరథ్ ఓ యూనివర్సిటీలో సహచర విద్యార్థిని చితకబాదిన ఘటన మీద గట్టిగా రెస్పాండ్ అయ్యారు. ఒకనాటి ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ కుమారులు ఉదయ్.. ఖాసే కూడా ఇలాగే ఆరాచకంగా ఉండేవారు అంటూ ఆర్జీవి ట్వీట్ చేశారు.

నిన్నా మోన్నా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథకు సంబంధించిన వీడియో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తోటి విద్యార్థినిపై బండి భగీరథ్ దాడి చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వీడియోను బీఆర్ఎస్ నేతలు ఆయుధంగా మార్చుకుని సంజయ్ ను బదనాం చేస్తున్నారు.

ఈ విషయంపై రామ్ గోపాల్ వర్మ కూడా స్పందించారు. ‘ఒకప్పుడు ఇరాక్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన సద్దాం హుస్సేన్ కుమారుడు ఉదయ్ హుస్సేన్ కాలం పోయింది. అయితే ఇప్పుడు మళ్లీ బండి సంజయ్ కొడుకు బండి భగీరథుడి రూపంలో పుట్టాడు’ అని ట్వీట్ చేశాడు.

ఇప్పుడు ఆ ట్వీట్ వైరల్ అవుతోంది. రాజకీయ నాయకులకు దూరంగా ఉంటానని వర్మ తనదైన శైలిలో స్పందిస్తున్నాడు. తాజాగా బండి బగీరథ్ పై వర్మ సంచలన వ్యాఖ్యలు చేసి మళ్లీ దుమారం రేపారు.. రాజకీయ డైలాగులు పేల్చి అందరి దృష్టిని ఆకర్షించారు.

ఇదిలా ఉండగా ఈ ఘటన మీద సంజయ్ స్పందిస్తూ. గతంలో సీఎం మనుమడి గురించి కొందరు కామెంట్స్ చేస్తే తానే ఖండించానని అన్నారు. తనను ఎదుర్కొనే దమ్ములేక తన కుమారుడిని అడ్డంపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.

ఆ.. ‘బండి’ వీడియోల వెనక ఉన్నది సొంత పార్టీ నేతలేనా?